Facebook Features ఫేస్‌బుక్‌లో కొత్త AI ఫీచర్లతో ప్రొఫైల్ ఫోటోకు కొత్త లుక్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లు సోషల్ మీడియాలోకి క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. మెటాకు చెందిన ప్లాట్‌ఫాంలు ఇప్పటికే అనేక ఫీచర్లను కలిగి ఉండగా.. మెటా తాజాగా ఫేస్‌బుక్ లో ఆకట్టుకొనే ఫీచర్లను లాంచ్ చేసింది. ఈ కొత్త ఏఐ ఫీచర్లతో ఫేస్‌బుక్ లో ఆకట్టుకొనే ఫోటోలు, స్టోరీస్, పోస్టులను క్రియేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
సింపుల్‌గా సెకన్ల వ్యవధిలోనే :
కొత్త ఫీచర్లతో ఫేస్‌బుక్ యూజర్లు తమ ప్రొఫైల్ ఫోటోను యానిమేటెడ్ వీడియోగా మార్చుకొనేందుకు అవకాశం కల్పిస్తుంది. స్టిల్ ఫోటోలను నేచురల్, వేవ్, హార్ట్, party hat, Confetti వంటి యానిమేషన్‌లలోకి సెకన్ల వ్యవధిలోనే మార్చుకోవచ్చు.

కెమెరా వైపు ఫోకస్ ఉన్న ఫోటోలు, ముఖం స్పష్టంగా ఉన్న ఫోటోలతో మెరుగ్గా యానిమేషన్ చేసుకోవచ్చని చెబుతోంది. దీంతోపాటు కెమెరా రోల్ నుంచి నేరుగా ఫోటోలను ఎంచుకొనేందుకు కూడా అవకాశం ఉంది లేదా ఇప్పటికే ఫేస్‌బుక్ లో అప్‌లోడ్ చేసిన ఫోటోలను యానిమేషన్ చేయవచ్చు.
ఫోటోలను ఎలా యానిమేషన్ చేయాలి?
> ఫేస్‌బుక్ లో తొలుత ప్రొఫైల్ పైన క్లిక్ చేసి, అనంతరం యానిమేటెడ్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి.
> ఆ తర్వాత అందుబాటులో ఉన్న యానిమేషన్‌లను ఉపయోగించండి.
> యానిమేషన్ చేసిన తర్వాత ఫోన్ లో సేవ్ చేసుకోవచ్చు లేదా నేరుగా ఫేస్‌బుక్ లో షేర్ చేయవచ్చు.
ఫేస్‌బుక్ స్టోరీస్, మెమోరీస్ ను రీస్టైల్ ఫీచర్ ద్వారా మార్పులు చేసుకోవచ్చు. అప్పటికే అందుబాటులో ఉన్న ఫార్మాట్లు లేదా మెటా ఏఐ తో టెక్ట్స్ ప్రాంప్ట్‌ల ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మూడ్, స్టైల్, లైటింగ్, కలర్స్, బ్యాక్‌డ్రాప్ వంటివి ఎంచుకొని, నచ్చిన విధంగా మార్పులు చేసుకోవచ్చు.
టెక్ట్స్ పోస్టులకు యానిమేటెడ్ బ్యాక్‌డ్రాప్ ను యాడ్ చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఇందుకోసం మీరు పోస్ట్ చేయాలని భావిస్తున్న టెక్ట్స్‌ను రాయాలి. అనంతరం అక్కడే ఉన్న A సింబల్‌ను క్లిక్ చేయాలి. అనంతరం అక్కడ అందుబాటులో ఉన్న స్టిల్స్ ను ఎంచుకోవాలి. యానిమేషన్ పూర్తయ్యాక, పోస్ట్ ను నేరుగా షేర్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది.
* మెటాకు చెందిన మరో ప్లాట్‌ఫాం వాట్సాప్ స్టేటస్ లో కస్టమైజ్ లిస్ట్‌లను క్రియేట్ చేసే ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo తెలిపింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహా ఇతర లిస్ట్‌లను క్రియేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఎప్పుడైనా వీటిలో మార్పులు చేసుకొనేందుకు కూడా అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉందని తెలిపింది.
దీంతోపాటు వాట్సాప్ వెబ్ లో ప్రస్తుతం విండోస్, iOS యాప్‌లో మాత్రమే వాయిస్, వీడియో కాల్ ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్ వెబ్‌లోనూ ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది. తొలి దశలో వన్ టు వన్ కాలింగ్ కు మాత్రమే ఈ ఫీచర్ సపోర్టు చేస్తుందని, గ్రూప్ కాలింగ్ కు సపోర్టు చేయకపోవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications