త్వరలో ఫేస్‌బుక్‌లో పాటలు వినడం కోసం మ్యూజిక్ సర్వీస్

Posted By: Staff

త్వరలో ఫేస్‌బుక్‌లో పాటలు వినడం కోసం మ్యూజిక్ సర్వీస్

న్యూయార్క్: ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మంది యూజర్లను సొంతం చేసుకున్నటువంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఇప్పుడు మరో కొత్త మార్గానికి శ్రీకారం చుట్టింది. ఏంటా ఆ కొత్త మార్గం అనుకుంటున్నారా.. ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌లో కొత్తగా మ్యూజిక్ సర్వీస్‌ని అందించనుంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ యాజమాన్యం ఆగస్టులో కాన్పరెన్స్‌ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే వెల్లడించడానికి సిద్దంగా ఉన్నారని యుఎస్ మీడియా తెలిపింది.

టెక్నాలజీ బ్లాగ్ గిగాఓమ్ కధనం ప్రకారం ఎవరైతే యూజర్స్ ఫేస్‌బుక్ ఎకౌంట్‌ని వాడుతున్నారో వారియొక్క ఫేస్‌బుక్ పేజీలలో ఎడమైవైపు భాగాన మ్యూజిక్ అనే కొత్త ట్యాబ్‌ని ఉంచడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎడమవైపు భాగాన ఫోటోస్, ప్రెండ్స్, డీల్స్ మొదలగునవి ఆవిష్కరించబడ్డాయి. మ్యూజిక్ ట్యాబ్‌ని ఎప్పుడైతే ప్రవేశపెడతారో అప్పుడు యూజర్స్ మ్యూజిక్ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే మ్యాజిక్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది.

ఈ మ్యూజిక్ డాష్ బోర్డ్ ఫీచర్ వల్ల ప్రెండ్స్‌కి మీరు సాంగ్స్, టాప్ సాంగ్స్, టాప్ ఆల్బమ్స్ మొదలగున వాటిని రికమెండ్ చేయడమే కాకుండా మీకు కూడా ఈ సాంగ్స్‌ని ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ఈ టెక్నాలజీ బ్లాగ్ ప్రకారం ఫేస్‌బుక్ యూరోపియన్ మ్యాజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ అయినటువంటి స్పోటీఫై‌తో పాట్నర్ షిప్ పెట్టుకుందని వెల్లడించారు. త్వరలోనే ఫేస్‌బుక్ ఈ కొత్త మ్యూజిక్ ఫీచర్‌తోటి యుఎస్ మార్కెట్ లోకి వెల్లనుందని సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot