దూకుడు పెంచిన ఫేస్‌బుక్.. యూజర్లకు పండగే పండగ!

Posted By: Prashanth

దూకుడు పెంచిన ఫేస్‌బుక్.. యూజర్లకు పండగే పండగ!

 

ఇటీవల ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ సరికొత్త అప్లికేషన్ సెంటర్‌ను లాంచ్ చేసింది. టాబ్లట్ అదేవిధంగా స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ స్టోర్‌లో సుమారు 600 అప్లికేషన్‌లను పొందుపరిచారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్(గుగూల్), ఐవోఎస్ (ఆపిల్) ఆపరేటింగ్ సిస్టంలను ఈ అప్లికేషన్ స్టోర్‌ సపోర్ట్ చేస్తుంది. విండోస్ మొబైల్ వర్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. శుక్రవారం నుంచి ఈ సేవలు యూఎస్‌లో అందుబాటులోకి వచ్చాయి. మరి కొద్ది వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ అప్లికేషన్ స్టోర్ సేవలు విస్తరించనున్నాయి.

ఫేస్‌బుక్.కామ్‌లో ఈ అప్లికేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక నెట్‌వర్కింగ్ వ్యవస్థలో ఓ భాగమై పనిచేసే ఈ అప్లికేషన్ సెంటర్ ద్వారా వివిధ రకాలైన వెబ్ అప్లికేషన్‌లతో పాటు నేటివ్ అప్లికేషన్‌లను యూజర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సోషల్ నెట్‌వర్కింగ్ హక్కు కింద వినియోగదారు ఈ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవటం లేదా ప్లే చెయ్యటం జరుగుతుంది. ఫేస్‌బుక్ ఏర్పాటు చేసిన ఈ అప్లికేషన్ సెంటర్ సౌలభ్యతతో ఎక్కువ డిమాండ్ లేదా ప్రజాదరణ ఉన్న అప్లికేషన్‌లను యూజర్ గుర్తించి తద్వారా తన అభిరుచులకు అనువైన వాటిని ఎంపిక చేసుకునేందుకు వెసలబాటు ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot