ఎలక్షన్ ట్రాకర్ అప్లికేషన్‌ను ప్రారభించిన ఫేస్‌బుక్

Posted By:

ఎలక్షన్ ట్రాకర్ అప్లికేషన్‌ను ప్రారభించిన ఫేస్‌బుక్

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన నేపధ్యంలో సామాజిక సంబంధాల నెట్‌వర్క్ ఫేస్‌బుక్ ‘ఎలక్షన్ ట్రాకర్' పేరుతో సరికొత్త అప్లికేషన్‌ను తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సరికొత్త డాష్ బోర్డ్ ఎలక్షన్ సమయంలో పార్టీలు, పార్టీల అభ్యర్థుల భవితవ్యం గురించి నెటిజనులు చర్చించుకంటున్న తీరును విశ్లేషించి ఆయా అభ్యర్థుల గెలుపు ఫలితాన్ని ఎప్పటికప్పుడు గ్రాఫ్‌ రూపంలో అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ను వినియోగిస్తోన్న దాదాపు 93 బిలియన్ల భారతీయులకు ఈ యాప్ దోహదపడుతుందని ఫేస్‌బుక్ అభిప్రాయపడింది.

సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఫిబ్రవరి 4, 2014తో 10 వసంతాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జూకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్ బృందం ‘‘Look Back'' పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫేస్‌బుక్ హిస్టరీకి సంబంధించి ముఖ్యమైన సందర్భాలు అంటే బాగా నచ్చిన పోస్టులు ఇంకా ఫోటోలను వీడియో ట్రైలర్ రూపంలో వీక్షించవచ్చు. ఈ వీడియోలను తమ తమ టైమ్‌లైన్‌లకు షేర్ చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot