విండోస్ 7 కోసం మెసెంజర్‌ని విడుదల చేసిన 'ఫేస్‌బుక్'

Posted By: Prashanth

విండోస్ 7 కోసం మెసెంజర్‌ని విడుదల చేసిన 'ఫేస్‌బుక్'

 

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కువ మంది యూజర్స్‌ని కలిగిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఫేస్‌బుక్‌కు యూజర్స్‌ని మరింత చేరువయ్యేందుకు గాను మరొ కొత్త అప్లికేషన్‌ని ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త అప్లికేషన్ ఏమిటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఫేస్‌బుక్ మెసెంజర్‌ని విడుదల చేసింది.

ఈ అప్లికేషన్ ద్వారా చాటింగ్, రీసీవ్ నోటిఫికేషన్స్‌లతో పాటు డెస్క్ టాప్ ద్వారా న్యూస్‌లను చదవొచ్చు. www.facebook.com ద్వారా కాకుండా ఈ మెసెంజర్ సహాయంతో ఈజీగా ఫేస్‌బుక్‌కి కనెక్ట్ అవ్వొచ్చు. ఇందులో ఉన్న వెబ్ ఇంటర్‌ఫేస్ సహాయంతో వీడియో చాట్, గ్రూప్‌చాట్‌లను కూడా చేయవచ్చు. గత నవంబర్ నెల నుండి ఈ అప్లికేషన్‌పై ఫేస్‌బుక్‌ టెస్టింగ్ చేస్తున్నప్పటికీ... డిసెంబర్‌లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇజ్రాయిల్ బ్లాగ్ 'టెక్‌ఐటి' లీక్ చేసింది.

ఫేస్‌బుక్‌ ఇప్పుడు అధికారకంగా ఈ అప్లికేషన్‌కి సంబంధించిన సమాచారం విడుదల చేసింది. అప్లికేషన్‌కు సంబంధించి మీ యొక్క ఫేస్‌బుక్‌ ఎకౌంట్లో 'డౌన్‌లోడ్ ' బటన్ ఇంకా రాని పక్షంలో కంగారు పడాల్సిన పనిలేదు. త్వరలోనే ఈ బటన్‌ని మీయొక్క ప్రొపైల్స్ లోకి నిక్షిప్తం చేయడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు ఆగలేని పక్షంలో విండోస్ 7కు సంబంధించిన ఫేస్‌బుక్ మెసెంజర్ని ఈ లింక్ ద్వారా డౌన్ లౌడ్ చేసుకోండి.

లింక్ --------: https://fbcdn_dragon-a.akamaihd.net/cfs-ak-ash4/84995/940/FacebookMessengerSetup.exe

మీరు గనుక విండోస్ ఎక్స్‌పి, విండోస్ విస్తా, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్నట్లైతే మీరు ఈ ఆప్లికేషన్‌ని ఇనిస్టాల్ చేసుకోలేరు. మిగతా ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సంబంధించిన అప్లికేషన్స్‌ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నట్లు ఫేస్‌బుక్ ప్రతినిధులు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot