'గూగుల్ ప్లస్' ని కాపీ కొట్టిన ఫేస్‌బుక్..!

Posted By: Prashanth

Facebook launches Widescreen Photo Viewer similar to Google+

 

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్‌లలో రోజు రోజుకీ పెరుగుతున్న పోటీ వాతావరణాన్ని తట్టుకునేందుకు గాను కొత్త ఫీచర్స్‌ వస్తున్నాయి. 800 మంది యూజర్స్‌ని కలిగి ప్రపంచంలో నెంబర్ వన్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌గా కొనసాగుతున్న ఫేస్‌బుక్ ఇటీవలే సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన 'గూగుల్ ప్లస్' పోటీని తట్టుకునేందుకు గాను అచ్చం గూగుల్ ప్లస్ మాదిరే కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ 'వైడ్‌స్క్రీన్ ఫోటో వీవర్' సహాయంతో ఫోటోలను ఎక్కువ రిజల్యూషన్‌తో చూడొచ్చు.

క్లిష్టమైన15 ఇంచ్ ల్యాప్‌టాప్‌లో 960 ఫిక్సల్ వెడల్పుతో పాటు 720 ఫిక్సల్ పోడవుగా ఇమేజిలు కనిపించనున్నాయి. ఫేస్‌బుక్ యూజర్స్ ఫోటోపై క్లిక్ చేయగానే.. ఓ సరిక్రొత్త ఇంటర్ ఫేస్ ఓపెన్ అయి కుడి భాగాన ఉన్న ఖాళీ స్పేసు పూర్తిగా కవర్ అయ్యేటట్లు ఫోటో పెద్దదిగా డెస్క్‌టాప్ మొత్తం ఇమడుతుంది. గతంలో ఫేస్‌బుక్‌లో ఏదైనా ఇమేజిని మీ స్నేహితులకు, సన్నిహితులకు షేర్ చేసుకోవడంతో పాటు లైక్ చేయడం, కామెంట్స్ వంటి వాటన్నింటిని కూడా చేయవచ్చు.

ఒక ఇమేజి నుండి వేరే ఇమేజికి వెళ్లాలను కుంటే యూజర్స్ తమ చేతిలో ఉన్న మౌస్‌ని ఇమేజిపై ఉంచగానే.. ఎడమ వైపు.. కుడి వైపున యారో మార్క్ వస్తాయి. వీటిపై క్లిక్ చేస్తే ఆటో మ్యాటిక్‌గా తరువాత ఫోటోలకి వెళతారు. ఇలా యూజర్స్ పూర్తి ఆల్బమ్‌ని వీక్షించవచ్చు. ఈ 'వైడ్‌స్క్రీన్ ఫోటో వీవర్' ఫోటో ఆల్బమ్ కాన్పెస్ట్‌ని ఫేస్‌బుక్ గూగుల్ ప్లస్ ఆధారంగా రూపొందించిదంటూ కొత్త మంది నిపుణులు వాదిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot