Facebook Libra క్రిప్టోకరెన్సీ, ఇండియాకు రావడం కష్టమే

By Gizbot Bureau
|

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్ కొత్తగా వివాదాస్పద క్రిప్టో కరెన్సీ చెల్లింపుల విధానం బిట్ కాయిన్ కరెన్సీ లిబ్రాను ప్రభుత్వాలు, ఆర్ధిక దిగ్గజాల ఆమోదంతో మార్కెట్లోకి తీసుకొస్తోందనే వార్తలు ఓ ఊపు ఊపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Facebook Libra క్రిప్టోకరెన్సీ, ఇండియాకు రావడం కష్టమే

ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని 2020లో అధికారికంగా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందని, ఈ ప్రాజెక్టులో ప్రపంచ అతిపెద్ద కార్పొరేట్ సంస్థలైన వీసా ఇంక్, మాస్టర్ కార్డ్ ఇంక్, పేపాల్ హోల్డింగ్స్ ఇంక్, ఉబర్ టెక్నాలజీస్ భాగస్వామలుగా ఉండనున్నాయని తెలిపింది. ప్రపంచ దేశాలకు ఈ క్రిప్టోకరెన్సీని పరిచయం చేస్తామని తెలిపింది.అయితే ప్రపంచదేశాలకు ఇది పరిచయమైనా ఇండియాలో దీనికి బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బ్రేక్ పడే అవకాశాలు

బ్రేక్ పడే అవకాశాలు

Facebookకి అతి పెద్ద మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. అందుకే Facebook ఇండియాలో కూడా లిబ్రా క్రిప్టోకరెన్సీ, కాలిబ్రా డిజిటల్ వ్యాలెట్ లాంచ్ చేయాలని చూస్తోంది. కానీ, ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో కూడా లీగల్ బిట్ కాయిన్ కరెన్సీని తీసుకురావాలనే Facebook ప్రయత్నాలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియాలో ప్రస్తుతం ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం.. క్రిప్టోకరెన్సీకి దేశంలో అనుమతి లేదు.

  RBI బ్యాన్

RBI బ్యాన్

ఇండియాలో క్రిప్టోకరెన్సీ తరహా ట్రాన్స్ జెక్షన్స్ పై RBI బ్యాన్ చేసింది. బ్లాక్ చెయిన్ ద్వారా బ్యాంకింగ్ నెట్ వర్క్ ల్లో క్రిప్టో కరెన్సీ లావాదేవీలే చేసేందుకు వీలు పడదు. క్యాలిబ్రా డిజిటల్ వ్యాలెట్ గ్లోబల్ గా WhatsApp యూజర్లందరికి అందుబాటులో రానుంది. కాగా క్రిప్టోకరెన్సీని బ్యాన్ చేసిన దేశాల్లో లిబ్రా లాంచ్ కాదు.సంక్లిష్టమైన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత వర్చువల్ కరెన్సీలతో (బిట్‌కాయిన్ మొదలైనవి) సామాన్య ప్రజానీకం భారీగా నష్టపోయే ప్రమాదముందనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు దీన్ని నిషేధించాయి.

 చట్ట రీత్యానేరం

చట్ట రీత్యానేరం

ఇండియాలో కూడా క్రిప్టోకరెన్సీ తరహా లావాదేవీలు చట్ట రీత్యానేరం. Facebook భారత్ లో క్రిప్టోకరెన్సీని లాంచ్ చేయాలంటే అంతకంటే ముందే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకోవాలి. కానీ, ఇప్పటివరకూ Facebook ఆర్బీఐకి దరఖాస్తు చేసుకున్నట్టు ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంలో ఆర్బీఐ కూడా స్పందించలేదు.

పలు సంస్థలతో భాగస్వామ్యం

పలు సంస్థలతో భాగస్వామ్యం

ఇదిలా ఉంటే ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ పేమెంట్స కోసం విసా, మాస్టర్ కార్డ్, పేయూ, ఉబర్ వంటి 28 పేమెంట్ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఫేస్ బుక్ మెసేంజర్, వాట్సప్ ప్లాట్ ఫాంలపై వర్చువల్ కరెన్సీ తో లావాదేవీలు జరుపుకునేందుకు ఈ సంస్థలు అనుమతిస్తాయి. అధికారికంగా ఇది లాంచ్ అయ్యాక మరో 100 మంది సభ్యులు ఇందులో చేరే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది.

ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ..

ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ..

వర్చువల్ కరెన్సీలతో రిస్క్ కారణంగా 2018 ఏప్రిల్ లోనే RBI రెగ్యులేటెడ్ ఎంటీటీలకు 3 నెలల గడువు విధించింది. దేశంలో వర్చువల్ కరెన్సీలతో డీలింగ్ నిలిపివేయాలని సూచించింది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఫేస్‌బుక్ లిబ్రా సిస్టమ్ డిజైన్ ఉండాల్సి ఉంటుంది. దేశీయ నెట్ వర్క్ ప్రమాణాలకు లోబడి ఉంటే మాత్రమే కరెన్సీ లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుంటుంది.

మొత్తంగా 1 బిలియన్ విలువైన నిధులు

మొత్తంగా 1 బిలియన్ విలువైన నిధులు

ఈ ప్రాజెక్టులో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల నుంచి మొత్తంగా 1 బిలియన్ విలువైన నిధులు అందుతాయని ఫేస్ బుక్ విశ్వసిస్తోంది. ఫేస్ బుక్.. స్థిరమైన కాయిన్ కరెన్సీని సృష్టించాలని చూస్తోందని 2018 ఏడాదిలో బ్లూమ్ బర్గ్ రిపోర్టు వెల్లడించింది.ఈ కాయిన్ కరెన్సీతో తమ సోషల్ ప్లాట్ ఫాం మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ట్రాన్స్ ఫర్ చేసుకునేలా సేవలు అందించాలని భావిస్తోంది. ఒక్క ఇండియాలోనే వాట్సప్ లో 20 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు.

Best Mobiles in India

English summary
Facebook may abort Libra launch in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X