టీనేజర్స్‌కి ఆల్కహాల్‌‌ని ఎంకేరేజ్ చేస్తున్న ఫేస్‌బుక్

Posted By: Staff

టీనేజర్స్‌కి ఆల్కహాల్‌‌ని ఎంకేరేజ్ చేస్తున్న ఫేస్‌బుక్

న్యూయార్క్: న్యూటన్ మూడవ సూత్రం ప్రకారం "ప్రతి చర్య కి ప్రతి చర్య" ఉంటుంది. ఈ సూత్రం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్‌కి కూడా సెట్ అవుతుంది. అది ఎలాగని అనుకుంటున్నారా.. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ వల్ల ఏవైనా పాజిటివ్ ఉపయోగాలు ఉంటే, అంతే విధంగా దాని వల్ల నెగిటివ్ ఉపయోగాలు కూడా ఉంటాయనేది నిర్విదాంశం. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్, మైస్పేస్ వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే మీ స్నేహితులకు కనెక్ట్ అవ్వవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ వెబ్ సైట్స్ వల్ల కొన్ని చెడ్డ అలవాట్లను కూడా మీరు పొందవచ్చు.

ఇటీవల సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ వల్ల టీనేజర్స్ కొన్ని చెడు వ్యసనాలకు గురి అవుతున్నారని ఓ సర్వే ప్రకటించింది. కొలంబియా యూనివర్సిటికి చెందిన నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వేలో ఎక్కువ మంది టీనేజర్స్ ఎక్కువ సమయాన్ని ఆల్కహాల్, టుబాకోల గురించి తెలుసుకొవడానికి, వాటిని ఎలా సేవించాలో వాటి గురించి చర్చించుకోవడానికి ఉపయోగిస్తున్నారని వెల్లడైంది.

కొలంబియా యూనివర్సిటీ రీసెర్చియర్స్ సుమారుగా 1,037 టీనేజర్స్‌ని ఇంటర్యూ చేసి వారికి డ్రగ్స్ తీసుకునేటప్పుడు, స్మోకింగ్ చేసేటప్పుడు తీసిన ఫోటలను సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో పోస్ట్ చేసిన ఇమేజిలను సేకరించడం జరిగింది. అంతేకాకుండా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో ఉన్న టీనేజర్స్ 40శాతం మంది ఇలాంటి వాటికి ఈజీగా దాసోహాం అవుతున్నారని తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot