ఫేస్‌బుక్‌లో 100 మిలియన్ల నకిలీ అకౌంట్లు
ప్రపంచవ్యాప్తంగా తమ వెబ్‌సైట్‌లో 100 మిలియన్ల నకిలీ అకౌంట్లు ఉన్నట్లు ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ వెల్లడించింది. ఈ నకిలీ అకౌంట్ల శాతం ఇండియా వంటి ప్రధాన మార్కెట్లోలో 5 నుంచి 15 మిలియన్ల వరకు పెరిగినట్లు కంపెనీ అంచనావేస్తోంది. తాజా త్రైమిసక నివేదికలో భాగంగా భారత్, టర్కీ వంటి దేశాల్లో నకలీ అకౌంట్ల శాతం పెరుగుతున్నట్లు ఫేస్‌బుక్ పేర్కొంది.

ఏడాదిన్నర క్రితం ఫేస్‌బుక్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోదారుల సంఖ్య 100 కోట్లు దాటినట్లు ప్రకటించింది. తాజాగా ఫేస్‌బుక్‌ను మొబైల్ ఫోన్ ద్వారా వినియోగిస్తోన్న వారి సంఖ్య 100 కోట్ల మార్క్‌ను దాటినట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. తాజాగా వైల్లడైన వివరాల మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య 1.28బిలియన్లుగా ఉంది. 2014 మొదటి త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలను ఫేస్‌బుక్ వెల్లడించింది.
నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌లు ఏలా ఉంటాయ్..?
మీకు తెలయని ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందా.సదరు అభ్యర్థనను అంగీకరించే ముందు ఆ అకౌంట్మంచిదో నకిలీదో తెలుసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించే క్రమంలో పాటించాల్సిన అంశాలు.
మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను పంపిన అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి ప్రొఫైల్‌ను తెరచి ఫోటోల కోసం శోధించండి. ప్రొఫైల్‌లో ఒక ఫోటో మాత్రమే ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ఫేక్ అకౌంటే. ఆ అకౌంట్‍కు సంబంధించి స్టేటస్ అప్‌డేట్‌లతో పాటు వాల్ పోస్టులు ఇంకా కామెంట్‌లను చూడండి. సదరు ఫేస్‌బుక్ అకౌంట్ యూజర్ చాలా కాలం క్రితం నుంచి ఎటువంటి పోస్టింగ్స్ ఇంకా కామెంట్లకు పాల్పడనట్లయితే నకిలీ అకౌంట్ గానే భావించాల్సి ఉంటుంది అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి స్నేహితుల జాబితాను తిరగవేయండి.
అందులో ఎక్కువ శాతం మంది స్నేహితులు వ్యతిరేక జెండర్ అయినట్లయితే ఆ అకౌంట్ సరదా కోసం సృష్టించనదని నిర్థారణకు రావచ్చు. అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి వ్యక్తిగత సమాచారమైన ఎడ్యుకేషన్, ఉద్యగం ఇంకా ఇతర ఆసక్తిలకు సంబంధించిన వివరాలను అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. సదరు అకౌంట్ హోల్డర్.. డేటింగ్ ఇంకా మహిళలు ఇంకా పురుషుల పట్ల ఆసక్తి వంటి అంశాలను ప్రస్తావించినట్లయితే నకిలీ అకౌంట్‌గా గుర్తించాల్సి ఉంటుంది. అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి పుట్టిన రోజు
వివరాలను క్షుణ్నంగా పరిశీలించండి. 1-1-1990, 31-12-1988 వంటి ఫ్యాన్సీ తేదీలు మీరు తారసపడినట్లయితే ఓ సారి ఆలోచించండి. ఆడవారి ప్రొఫైల్స్‌ను కలిగి ఉన్న నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌లు ఫోన్ నెంబర్లను కలిగి ఉంటాయి. ఈ విషయాన్ని మరిచిపోవద్దు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications