ఫేస్‌బుక్ ప్రియులకు శుభవార్త!

ఫేస్‌బుక్‌ను ఆరాధించే చిన్నారులకు శుభవార్త.. 13 సంవత్సరాలలోపు వయసు కలిగిన పిల్లలు ఫేస్‌బుక్‌లో తమ ప్రొఫైల్‌ను ఉంచకూడదన్న నిబంధనను సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ వినియోగంలో భాగంగా చిన్నారుల పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే దిశగా ఫేస్‌బుక్ వర్గాలు ఆలోచిస్తున్నాయి. ఈ కొత్త నిర్ణయం అమలులోకి వస్తే యూజర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువ. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌కు దాదాపు 90 కోట్టమంది వినియోగదారులుండగా, ఈ కొత్త విధానం వల్ల ఆ సంఖ్య 100 కోట్లకు చేరే అవకాశముంది.
‘13 ఏళ్లలోపు పిల్లలు వాళ్ల వయసుసు తప్పుగా చూపించి, మా సైట్‌లో చేరినట్లు సాధికారమైన రుజువులున్నాయని’ ఫేస్‌బుక్ ఉన్నతాధికారి మిల్నర్ ఈ సందర్భంగా సండే టైమ్స్ మీడియాకు వెల్లడించారు. ఏదేమైనప్పటికి, ఈ నిర్ణయం ఇంకా తుది దశలోనే ఉందని మిల్నర్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి బ్రిటన్‌లోని బెర్క్‌షైర్‌లో చర్చాగోష్టిని నిర్వహిస్తునట్లు తెలిపారు. అయితే వయోపరిమితికి సంబంధించి అమెరికాలో న్యాయ పరమైన ఇబ్బందులున్నాయన్నారు.
ఈ కొత్త నిర్ణయాన్ని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నామన్నారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని తల్లిదండ్రులు సైతం ఆమోదిస్తున్నారని ఆయన తెలిపారు. నిషేధం లేకపోతే పెద్దవారితో పిల్లలకు అసహజ సంబంధాలు ఏర్పడే ప్రమాదముందని, పిల్లలపై బూతులతో దాడులు పెరిగే అవకాశ ముందని వయోపరిమితిని సమర్థించేవారు వాదిస్తున్నారు.


Click it and Unblock the Notifications








