వీడియో కాలింగ్‌తో ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్

ఫేస్‌బుక్ ఇంక్ తమ మెసెంజర్ యాప్ కోసం ఉచిత వీడియో కాలింగ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. మైక్రోసాఫ్ట్ స్కైప్, గూగుల్ హ్యాంగ్ అవుట్స్, యాపిల్ ఫేస్‌టైమ్ వంటి ఇంటర్నెట్ వీడియో కాలింగ్ సర్వీసులకు ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ వీడియో కాలింగ్ ఫీచర్ పోటీగా నిలవనుంది. ఈ ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను ప్రస్తుతం 600 మిలియన్లకు పైగా యూజర్లు ఉపయోగించుకోవచ్చు.

ప్రస్తుతం ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ వీడియో కాలింగ్ ఫీచర్ ప్రస్తుతానికి అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఫ్రాన్స్, బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, గ్రీస్, మెక్సికో, ఉరేగ్వే దేశాల్లో అందుబాటులో ఉంది. మరికొద్ది నెలల్లో మిగిలిన దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. యాపిల్ ఐఓఎస్ ఇంకా గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌లు ఈ వీడియో కాలింగ్ యాప్ సపోర్ట్ చేస్తుంది. మెసెంజర్ యాప్ ఓపెన్ చేసిన తరువాత స్ర్కీన్ కుడివైపు టాప్ కార్నర్‌లో కనిపించే వీడియో ఐకాన్‌ను క్లిక్ చేయటం ద్వారా వీడియో కాలింగ్ సాధ్యమవుతుంది.
ఇంకా చదవండి : జపాన్ బ్యాంక్‌లో రోబోట్ ఉద్యోగి


Click it and Unblock the Notifications








