ఇక ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా డబ్బులు పంపుకోవచ్చు

Posted By: BOMMU SIVANJANEYULU

ఫేస్‌బుక్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయం 2015 నుంచే అందుబాటులో ఉన్నప్పటికి , ఆ సౌకర్యం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమై ఉండేది. అయితే, తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయం త్వరలోనే భారతీయులకు కూడా అందుబాటులోకి రాబోతోంది.

ఇక  ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా డబ్బులు పంపుకోవచ్చు

ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ సిస్టం PayPalతో ఫేస్‌బుక్ గతేడాది ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఆ ఒప్పందం తరువాత నుంచి యూఎస్‌లోని ఫేస్‌బుక్ యూజర్లు పేపాల్ అకౌంట్లను ఉపయోగించుకుని మెసెంజర్ యాప్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ నిర్వహించుకోగలుగుతున్నారు.

ఇటీవల ఈ రెండు సంస్థల మధ్య అవగాహన మరింత బలపడటంతో, పేపాల్ యూజర్లు తమ అకౌంట్‌లను ఫేస్‌బుక్ మెసెంజర్‌కు ఇంటిగ్రేట్ చేసుకుని నేరుగా మెసెంజర్ చాట్ విండో నుంచే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకో గలుగుతున్నారు. ప్రస్తుతానికి ఈ సదుపాయం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికి త్వరలోనే భారత్ సహా అన్ని దేశాలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.

ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలనుకునే యూజర్లు మెసెంజర్ యాప్ స్ర్కీన్ పై కనిపించే blue plus icon పై టాప్ ఇచ్చి అందులోని గ్రీన్ పేమెంట్స్ బటన్ పై క్లిక్ చేస్తా చాలు. నగదు సెండ్ చేసే సమయంలో ఫండింగ్ సోర్స్ క్రింద తమ PayPal అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

గతంలో ఫేస్‌బుక్ ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే యూజర్లు ముందుగా తమ డెబిట్ కార్డ్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను ఫేస్‌బుక్ అకౌంట్‌లతో ఇంటిగ్రేట్ చేయవల్సి వచ్చేది. ఇప్పుడు అలా చేయవల్సిన పని ఉండదు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు KRACK Wi-Fi ముప్పు..

పేపాల్‌తో ఫేస్‌బుక్ ఒప్పందం కుదర్చుకున్న తరువాతి నుంచి 2.5 మిలియన్ల యూజర్లు తమ పేపాల్ అకౌంట్‌లను మెసెంజర్ యాప్‌తో లింక్ చేసుకున్నారట. అంతేకాకుండా, అమెరికాలోని అత్యధిక మంది పేపాల్ యూజర్లు ఫేస్‌బుక్ ద్వారానే నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారట. ఓ విశ్లేషణ ప్రకారం ఒక్క 2017లోనే 24 బిలియన్ డాలర్ల నగదు లావాదేవీలు ఫేస్‌బుక్ - పేపాల్ ద్వారా జరిగినట్లు వెల్లడైంది.

టెక్నాలజీ పరంగా మరింత ముందంజలో ఉన్న పలు దేశాల్లో డిజిటల్ చెల్లింపు వినియోగం ఇప్పటికే విస్తరించింది. అభివృద్థి చెందుతోన్న దేశాల్లో ఈ విధానం ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఈ క్రమంలో గూగుల్, యాపిల్, సామ్‌సంగ్, పేపాల్ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు మొబైల్ పేమెంట్ టెక్నాలజీని మరింత విప్లవాత్మకంగా మలిచే ప్రయత్నం చేస్తున్నాయి.

అమెరికా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న PayPal Holdings, Incను 1998లో ప్రారంభించారు. 2002లో ఈ కంపెనీని ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈబే, $1.5 బిలియన్ చెల్లించి సొంతం చేసుకుంది. అతిపెద్ద ఇంటర్నెట్ పేమెంట్ కంపెనీల్లో ఒకటైన పేపాల్ 2015లో స్వతంత్ర కంపెనీగా అవతరించింది.

English summary
Facebook Messenger has got the PayPal integration that lets users send or receive money within the app.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot