ఫేస్‌బుక్ మెసెంజర్‌కు కొత్త ఫీచర్లు

Written By:

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్ కోసం మరిన్ని విప్లవాత్మక ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. మెసెంజర్ యాప్ కోసం ఫేస్‌బుక్ రోల్ అవుట్ చేయబోయే కొత్త ఫీచర్లలో ఇన్-స్టోర్ పేమెంట్ (గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం), సీక్రెట్ కన్వర్‌సేషన్స్ వంటి కొత్త చాట్ ఆప్షన్‌లు ఉండబోతున్నట్లు సమాచారం. ఫేస్‌బుక్ ఈ వార్తల పై అధికారికంగా స్పందించాల్సి ఉంది. మెసెంజర్ యాప్ గురించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : సంచలనం రేపుతోన్న సామ్‌సంగ్ వాచ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డెస్క్‌టాప్ పై కూడా వాడుకోవచ్చు

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ గురించి ఆసక్తికర విషయాలు

అవును మీరు వింటున్నది నిజమే.. ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవచ్చు. డెస్క్‌టాప్ పై మెసెంజర్ ఇంటర్‌ఫేస్ అచ్చం మొబైల్ యాప్ మాదిరిగానే ఉంటుంది. ఏ విధమైన న్యూస్ ఫీడ్స్ మీకు విఘాతం కలిగించవు. మిత్రులతో హ్యాపీగా చాటింగ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ మెసెంజర్‌ను మీ డెస్క్‌టాప్ పై ట్రై చేసేందుకు క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేదు

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ గురించి ఆసక్తికర విషయాలు

మెసెంజర్ యాప్ వాడటానికి ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేదు. మెసెంజర్ యాప్‌లో "Not on Facebook?" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మొబైల్ నెంబరుతో యాప్‌‍లోకి లాగిన్ కావొచ్చు.

Uber car సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ గురించి ఆసక్తికర విషయాలు

మెసెంజర్ యాప్ ద్వారా Uber car సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. యాప్‌లోని More iconను సెలక్ట్ చేసుకుని అందులోని Transportation ఆప్షన్ పై టాప్ చేయండి. ఇక్కడ మీకు Uber సర్వీసుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. మీ అకౌంట్ లోకి లాగిన్ అవటం ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ పంపొచ్చు.

ఒకే గ్రూప్‌తో చాట్

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ గురించి ఆసక్తికర విషయాలు

మీరు తరచూ ఒకే గ్రూప్‌తో చాట్ చేస్తుంటారా..? అయితే, మీరు ఆ గ్రూప్‌ను పిన్ చేసుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మెసెజ్ వచ్చిన ప్రతిసారి ఆ మెసెజ్‌ను వెతుక్కోవల్సిన అవసరం ఉండదు. మీ కళ్ల ముందే కనిపిస్తుంది. మెసెంజర్ యాప్‌లో మీకు నచ్చిన గ్రూప్ చాట్‌ను పిన్ చేయదలిచినట్లయితే యాప్ బాటమ్‌లో కనిపించే గ్రూప్ బటన్ పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు యాప్ ఎడమ వైపు టాప్ కార్నర్‌లో Pin button కనిపిస్తుంది.

conversationను మ్యూట్ చేయదలిచినట్లయితే

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ గురించి ఆసక్తికర విషయాలు

మెసెంజర్ యాప్‌లో ఏదైనా conversationను మ్యూట్ చేయదలిచినట్లయితే ఆ మెసెజ్ హెడర్ పై టాప్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ కనిపిస్తాయి, వాటిలో మీరు conversation ఎంత సేపటి వరకు మ్యూట్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవచ్చు.

ఫోటోలను సులువుగా సెండ్

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ గురించి ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీ మిత్రులకు ఫోటోలను చాలా సులువుగా సెండ్ చేసుకోవచ్చు. యాప్‌లో పొందుపరిచిన ఫోటో మ్యాజిక్ ఫీచర్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీకు నోటిఫికేషన్‌లను పంపుతుంది.

ప్రత్యేకమైన యానిమేటెడ్ స్టఫ్‌

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ గురించి ఆసక్తికర విషయాలు

ప్రత్యేకమైన యానిమేటెడ్ స్టఫ్‌ను అందించే Giphy, GIF keyboard వంటి యాప్స్ మెసెంజర్‌‍లో అందుబాటులో ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసుకోవటం ద్వారా ప్రత్యేకమైన జిఫ్ ఫైల్స్ ను షేర్ మీరు చేయవచ్చు.

లోకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ గురించి ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీ లోకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook Messenger may soon have new chat options. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting