ఫేస్‌బుక్- మెటా కంపెనీ నుంచి ప్రపంచంలో వేగవంతమైన AI సూపర్‌కంప్యూటర్‌

|

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌కంప్యూటర్‌ను నిర్మించినాట్లు ఇటీవల ప్రకటించింది. మెటా కంపెనీ యొక్క పరిశోధనా బృందం యొక్క సమాచారం ప్రకారం AI రీసెర్చ్ సూపర్‌క్లస్టర్ (RSC)గా పిలువబడే ఒక సూపర్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేసింది. ఇది 'నేడు నడుస్తున్న అత్యంత వేగవంతమైన AI సూపర్‌కంప్యూటర్‌లలో ఒకటి' అని విశ్వసిస్తోందని పేర్కొంది. AI రీసెర్చ్ సూపర్‌క్లస్టర్ అనేది ప్రపంచంలో అత్యంత వేగవంతమైనదిగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది 2022 మధ్యనాటికి పూర్తిగా నిర్మించబడనున్నట్లు కూడా తెలిపింది.

 

RSC

ట్రిలియన్ల ఉదాహరణల నుండి నేర్చుకునే, వందలాది విభిన్న భాషల్లో పని చేసే, టెక్స్ట్, ఇమేజ్‌లు మరియు వీడియోలను సజావుగా విశ్లేషించి ఇతర విషయాలతోపాటు కొత్త ఆగ్మెంటెడ్ రియాలిటీ టూల్స్‌ను అభివృద్ధి చేసే మెరుగైన AI మోడల్‌లను రూపొందించడంలో కంపెనీకి చెందిన AI పరిశోధకులు తమ సూపర్ కంప్యూటర్ RSC కు సహాయం చేస్తుందని మెటా సంస్థ తెలిపింది. ఇది కాకుండా ఏదైనా ఒక చర్య, ధ్వని లేదా ఫోటో హానికరమా లేదా నిరుపాయమైనదా అని నిర్ధారించడానికి కంపెనీ తన AI మోడల్‌లకు త్వరగా శిక్షణ ఇవ్వగలదు. ఇది కంపెనీ యొక్క ప్రస్తుత AI సిస్టమ్‌లను బలోపేతం చేస్తుంది మరియు సెకన్లలో హానికరమైన కంటెంట్‌ను గుర్తించడంలో కూడా సహాయపడుతుంది.

COVID బూస్టర్ షాట్ స్కామ్‌ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ఎలా?COVID బూస్టర్ షాట్ స్కామ్‌ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ఎలా?

Meta
 

Meta యొక్క సూపర్‌కంప్యూటర్ లోని ముఖ్యమైన విషయాలలో వీటన్నింటికీ మించి AI రీసెర్చ్ సూపర్‌క్లస్టర్ అంతిమంగా మెటావర్స్‌ను నిర్మించాలనే దాని వ్యవస్థాపకుడి దృష్టిని సాధించడంలో కంపెనీకి సహాయపడుతుంది. RSCతో చేసిన పని తదుపరి ప్రధాన కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్ కోసం టెక్నాలజీలను నిర్మించడానికి మార్గం సుగమం చేస్తుంది. మెటావర్స్, AI- రన్ అప్లికేషన్‌లు వంటి మరిన్ని ఉత్పత్తులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అని మెటా సంస్థ ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు.

AI రీసెర్చ్ సూపర్ క్లస్టర్ (RSC)

AI రీసెర్చ్ సూపర్ క్లస్టర్ (RSC)

మెటా సంస్థ తన యొక్క వివరణాత్మక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపిన ప్రస్తుత సమాచారం ప్రకారం RSC మొత్తం 760 NVIDIA DGX A100 సిస్టమ్‌లను దాని కంప్యూట్ నోడ్‌లుగా కలిగి ఉంది. ఇందులో మొత్తంగా 6,080 GPUలు ఉన్నాయి. RSC యొక్క స్టోరేజ్ టైర్‌లో 175 పెటాబైట్‌ల ప్యూర్ స్టోరేజ్ ఫ్లాష్‌అరే, 46 పెటాబైట్‌ల కాష్ స్టోరేజ్ పెంగ్విన్ కంప్యూటింగ్ ఆల్టస్ సిస్టమ్‌లు మరియు 10 పెటాబైట్ల ప్యూర్ స్టోరేజ్ ఫ్లాష్‌బ్లేడ్ ఉన్నాయి.

అధిక డేటా యూజర్లకు ఉపయోగకరమైన జియో హెవీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు...అధిక డేటా యూజర్లకు ఉపయోగకరమైన జియో హెవీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు...

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌

మెటా యొక్క లెగసీ ప్రొడక్షన్ మరియు రీసెర్చ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పోలిస్తే ప్రారంభ బెంచ్‌మార్క్‌లు కంపెనీ ప్రస్తుత సిస్టమ్‌ల కంటే 20 రెట్లు వేగంగా కంప్యూటర్ విజన్ వర్క్‌ఫ్లోలను నడుపుతున్నాయని కంపెనీ తెలిపింది. ఇంకా కంపెనీ తన సూపర్‌కంప్యూటర్‌ను నిర్మించే రెండవ దశను పూర్తి చేసిన తర్వాత ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన AI సూపర్‌కంప్యూటర్‌గా అవతరించనుందని తెలిపింది. మిక్స్‌డ్ ప్రిసిషన్ కంప్యూట్‌లో దాదాపు 5 ఎక్స్‌ఫ్లాప్‌లను ప్రదర్శిస్తుందని కంపెనీ తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Facebook-Meta Working on World’s Fastest AI Supercomputer: Here are The Details.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X