ఫేస్‌బుక్ ఆఫీసు ఇప్పుడు గ్రీన్ క్యాంపస్‌లో...

Posted By:

ఫేస్‌బుక్ ఆఫీసు ఇప్పుడు గ్రీన్ క్యాంపస్‌లో...

 

పాపులర్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కాలిఫోర్నియాలో కొత్తగా వన్ మిలియన్ స్కేర్ ఫీట్‌లో నిర్మించిన 'మెన్లో పార్క్ సిటీ' బిల్డింగ్ లోకి అధికారకంగా ఉద్యోగులను తరలించడం జరిగింది. ప్రపంచంలో అతి పెద్ద పాపులర్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైటైన ఫేస్‌బుక్ మెన్లో పార్క్‌లో ఉన్న విల్లో రోడ్ 1601లో కొత్తగా నిర్మించిన కొత్త బిల్డింగ్‌ని అఫీసియల్ ఫేస్‌బుక్ అధికారిక బిల్టింగ్‌గా తెలిపింది.

ఈ క్యాంపస్ మొత్తాన్ని ఫేస్‌బుక్ గ్రీన్ క్యాంపస్‌గా  నామకరణం చేసింది. ప్రయివేట్ ఆఫీసులు, క్యూబికల్స్ లేకుండా  ఇందులో మొత్తం  పది బిల్డింగ్స్‌ని సమూహాంగా నిర్మించారు. గతంలో ఫేస్‌బుక్ క్యాంపస్ కాలిఫోర్నియాలోని 'పాల్ ఆల్టో'లో ఉండేది. ఇందులో ఉన్న లోకల్ ఉద్యోగులు సుమారుగా 2,000 మందిని కొత్త క్యాంపస్‌‍కి పంపించడం జరిగింది.

కొత్తగా నిర్మించిన ఈ క్యాంపస్‌లో అధునాతన సౌకర్యాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆధునాతన సౌకర్యాలలో చెప్పుకోదగ్గవి కాఫీ షాప్స్, డాక్టర్స్, జిమ్ మొదలగునవి. ప్రస్తుతం నిర్మించిన క్యాంపస్‌లో ఈస్ట్ క్యాంపస్‌లో మొత్తం 9,400 మంది ఉద్యోగులకు స్దానం కల్పించవచ్చునని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot