ఫేస్‌బుక్‌లో ముఖాలు తొలగించాలి!

Posted By: Prashanth

ఫేస్‌బుక్‌లో ముఖాలు తొలగించాలి!

 

బెర్లిన్: ఫేస్‌బుక్‌లోని వ్యక్తుల ముఖాలను తొలగించాలని జర్మనీకి చెందిన సమాచార సంరక్షణ అధికారి ఒకరు ఆ వెబ్‌సైట్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. వ్యక్తుల బయోమెట్రిక్ వివరాలను వారి అనుమతి లేకుండా తీసుకోవడం యూరోపియన్ గోప్యతా చట్టాలకు విరుద్ధమని ఆయన వెల్లడించారు.

ఫేస్‌బుక్‌ను జర్మన్, యూరోపియన్ యూనియన్ నియమాల పరిధిలోకి తీసుకురావడానికి జరిగిన చర్చలు విఫలమయ్యాయని జోహాన్నెస్ కాస్పర్ అనే ఆ అధికారి వెల్లడించారు. ఫేస్‌బుక్‌లోని 'ఫోటో ట్యాగింగ్' ఫీచర్‌ను కాస్పర్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఫీచర్‌లో ఫేస్‌బుక్.. ఆయా వ్యక్తులు అప్‌లోడ్ చేసిన ఫోటోలోని వారి పేర్లను అడుగుతుంది. అనంతరం ఆ ఫోటోలోని ముఖకవళికల ఆధారంగా.. అవే పోలికలున్న వ్యక్తుల ఫోటోలను తన సైట్‌లో గుర్తిసుంది.

అయితే ఇది అక్రమమని.. ఆయా వ్యక్తుల నుంచి అనుమతి పొందకుండా ఇలా వారి ఫోటోలను వాడుకోవడం చట్టవిరుద్ధమని కాస్పర్ వాదిస్తున్నారు. దీని వల్ల బయోమెట్రిక్ సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తమ ఫోటో ట్యాగింగ్ ఫీచర్ యూరోపియన్ యూనియన్ నిబంధనలకు పూర్తిగా లోబడి ఉందని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో తెలిపింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting