Home
News

ఫేస్బుక్ నుండి Avatar కొత్త ఫీచర్, ఈ రోజే లాంచ్.

By Maheswara

ఫేస్బుక్ కొత్త ఫీచర్ అవతార్ ను ఇండియా లో లాంచ్ చేస్తున్నట్లు ఈ రోజు ప్రకటించింది.ఈ ఫీచర్ తో అచ్చం మీ లాగే ఉండే డిజిటల్ వ్యక్తి ని సృష్టిస్తుంది.ఈ డిజిటల్ ప్రతి రూపాన్ని కూడా అచ్చం మీ లాగే వివిధరకాల హావభావాలు పలికించే విధంగా ఎంపిక చేసుకోవచ్చు.

 డిజిటల్ ప్రతిరూపాన్ని

డిజిటల్ ప్రతిరూపాన్ని

ఈ రోజు నుండి మొదలు, ఇండియా లో ఫేస్బుక్ ఉపయోగించే ఖాతాదారులు కార్టూన్ లాంటి ఈ డిజిటల్ ప్రతిరూపాన్ని వాడటానికి అవకాశం ఉంది. ఈ ఫీచర్ తో మీ డిజిటల్ ప్రతిరూపాన్ని వివాద రకాల ముఖ చిత్రాలు ,హెయిర్ స్టైల్స్ మరియు మీ దుస్తులు ను కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.ఇలా రూపొందించిన మీ అవతార్ ను ఫేస్బుక్ కామెంట్లు ,స్టోరీ లు,ప్రొఫైల్ పిక్చర్లు ఇంకా ఫేస్బుక్ మెసెంజర్ చాటింగ్ ల లో కూడా వాడుకునే వీలు ఉంది.అంతే కా వీటిని వాట్సాప్ చాటింగ్ లోకి కూడా పంచు కునే వీలు ను ఫేస్బుక్ మీకు కల్పిస్తుంది.

అవతార్ ఫీచర్ ను ఫేస్బుక్ అప్ ద్వారా

అవతార్ ఫీచర్ ను ఫేస్బుక్ అప్ ద్వారా

ఫేస్బుక్ అధికారికంగా విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ ఫేస్బుక్ అవతార్ ఫీచర్ ను ఫేస్బుక్ అప్ ద్వారా, avatar creator bookmark సహాయం తో వాడుకోవడానికి వీలుంటుంది.కామెంట్ లు పంచుకునే కామెంట్ composer తో కూడా దీన్ని ఉపయోగించ వచ్చు.
ఇతరులు పంపిన వారి అవతార్ లును మీ చూసే టప్పుడు కూడా వాటి ద్వారా మీ అవతార్ లను చేసుకోవడానికి వీలుంటుంది.

ఎలా వాడాలో తెలుసుకుందాం

ఎలా వాడాలో తెలుసుకుందాం

ఈ అవతార్ ఫీచర్ ను ఎలా వాడాలో తెలుసుకుందాం
* మీ ఫోన్ లో facebook లేదా messenger comment composer చూడండి
* అక్కడ కనిపించే Smiley బటన్ ను క్లిక్ చేయాలి
* దాని తర్వాత Sticker tab ను క్లిక్ చేస్తే "Create Your Avatar"! Or find the avatar creator ఆప్షన్ లు మీకు కనిపిస్తాయి
దీని ద్వారా మీరు సులువుగా మీ డిజిటల్ అవతార్ ను రూపొందించుకోవచ్చు.

ఫేస్బుక్ అందించిన సమాచారం ప్రకారం ఈ అవతార్ ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల వినియోగ దారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.త్వరలోనే  iOS ,ఆపిల్ ఫోన్ల లో కూడా ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టనున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది.

 

చైనా అప్ లను బ్యాన్

చైనా అప్ లను బ్యాన్

ఇండియా చైనా దేశాలమధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ఈ సమయంలో, ఇండియా tiktok తో సహా 59 చైనా అప్ లను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.ఇలాంటి సమయం లోనే ఫేస్బుక్ ఇలాంటి  కొత్త ఫీచర్ ను ఇండియాలో లాంచ్ చేయడం పట్ల ఇంటర్నెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Facebook New Avatar Feature Launched in India: Check Details Here 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X