ఫేస్‌బుక్ మెసెంజర్‌ కొత్త అప్ డేట్!!! మెసేజ్ లిమిట్ ఫార్వార్డ్ ఫీచర్!!

|

ఫేస్‌బుక్ యొక్క అనుబంధ యాప్ మెసెంజర్ లో ఇప్పుడు కొత్తగా ఫార్వార్డింగ్ పరిమితిని తీసుకువస్తోంది. దీని ద్వారా ఏదైనా మెసేజ్ ను ఒకేసారి కేవలం ఐదుమంది వినియోగదారులకు మాత్రమే ఫార్వార్డ్ చేయడానికి అనుమతిస్తుంది. మెసెంజర్ ప్లాట్‌ఫామ్ లో ప్రస్తుతం వైరల్ అవుతున్న తప్పుడు సమాచారం యొక్క వ్యాప్తిని తగ్గించడానికి సంస్థ కొత్త ఫీచర్ ను అమలు చేయనున్నది. 2018 లో ఫేస్‌బుక్ యొక్క అనుబంధ సంస్థ వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో కూడా ఇలాంటి ఫార్వార్డింగ్ పరిమితిని ప్రవేశపెట్టింది. మెసెంజర్ యాప్ యొక్క కొత్త అప్ డేట్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మెసెంజర్ లిమిట్ ఫార్వార్డింగ్ ఫీచర్

మెసెంజర్ లిమిట్ ఫార్వార్డింగ్ ఫీచర్

ఫార్వార్డింగ్ పరిమితిని మెసెంజర్‌ యాప్ కు చేర్చడంతో మీరు ఏదైనా ఒక ప్రత్యేకమైన మెసేజ్ ను ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మందికి లేదా గ్రూపులకు ఫార్వార్డ్ చేయడం జరగదు. ఒక వేళ మీరు మీ ఫార్వార్డింగ్ జాబితాకు క్రొత్త వినియోగదారులను జోడించడానికి ప్రయత్నిస్తే కనుక "ఫార్వార్డింగ్ పరిమితి చేరుకుంది" అనే నోటిఫికేషన్‌ను యాప్ మీకు చూపుతుంది.

 

Also Read: భారీగా ధరలు పెంచనున్న Vodafone, Airtel. అప్పులు తీర్చాలంటే తప్పదు మరీ...!Also Read: భారీగా ధరలు పెంచనున్న Vodafone, Airtel. అప్పులు తీర్చాలంటే తప్పదు మరీ...!

మెసెంజర్ లిమిట్ ఫార్వార్డింగ్ ఫీచర్ ముఖ్య ఉద్దేశం

మెసెంజర్ లిమిట్ ఫార్వార్డింగ్ ఫీచర్ ముఖ్య ఉద్దేశం

మెసేజ్ల యొక్క ఫార్వార్డింగ్‌ను పరిమితం చేయడం అనేది ప్రస్తుత సమయంలో ప్రపంచానికి హాని కలిగించడానికి వైరల్ అవుతున్న తప్పుడు సమాచారం మరియు హానికరమైన కంటెంట్ యొక్క వ్యాప్తిని మందగించడానికి ఒక ముఖ్యమైన వారధిగా పనిచేస్తుంది అని ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, మెసెంజర్ ప్రైవసీ అండ్ సేఫ్టీ డైరెక్టర్ జే సుల్లివన్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు.

మెసెంజర్‌ లిమిట్ ఫార్వార్డింగ్ లభ్యత
 

మెసెంజర్‌ లిమిట్ ఫార్వార్డింగ్ లభ్యత

ఫార్వార్డింగ్ పరిమితి కొత్త రకం ఫీచర్ ను మొదటగా మార్చిలో అంతర్గతంగా పరీక్షించారు కానీ ఇప్పుడు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఈ ఫార్వార్డింగ్ పరిమితి ఫీచర్ ను అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మురం చేసింది. ఇది ప్రస్తుతం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ సెప్టెంబర్ 24 నుండి అందుబాటులో ఉంటుంది.

మెసెంజర్‌ ఫార్వార్డింగ్ పరిమితి Vs వాట్సాప్‌ ఫార్వార్డింగ్ పరిమితి

మెసెంజర్‌ ఫార్వార్డింగ్ పరిమితి Vs వాట్సాప్‌ ఫార్వార్డింగ్ పరిమితి

మెసెంజర్‌ యొక్క ఫార్వార్డింగ్ పరిమితి ఫీచర్ న్యూజిలాండ్ మరియు యుఎస్ దేశాలలో మొదలుకానున్న ప్రధాన ఎన్నికలకు ముందు అందుబాటులోకి రానున్నది. అలాగే ఇది ఆగస్టు 2018 నుండి వాట్సాప్‌లో ప్రారంభమైన ఫార్వర్డ్ మెసేజ్ పరిమితి ఎలా లభిస్తుందో చాలా వరకు అది కూడా అలాగే పోలి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Facebook New Update: Limits Forward Messages Only Five People

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X