Home
News

ఫేస్‌బుక్ తాజా అప్‌డేట్ ఏంటి..?

By Prashanth
Facebook New Update


ఆపిల్ ఫోన్ యూజర్ల‌కు శుభవార్త.. ఇక పై మీరు ఫేస్‌బుక్ సేవలను మరింత వేగవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఇందు కోసం ఫేస్‌బుక్ తన ఐవోఎస్ అప్లికేషన్‌ను మరింత ఆధునీకరించింది. ఈ చర్యతో ఫోటో లోడింగ్, న్యూస్ ఫీడ్స్, నోటిఫికేషన్స్, స్టోరీస్ వంటి అంశాలు సెకన్ల వ్యవధిలో అప్‌డేట్ కాబడతాయి. ‘ఫేస్ బుక్ 5.0’గా డిజైన్ కాబడిన అప్‌డేటెడ్ ఐవోఎస్ అప్లికేషన్ అంతరాయంలేని సోషల్ నెట్‌వర్కింగ్ అనుభూతులను చేరువ చేస్తుంది. సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం అధికంగా మొబైల్ ఫోన్‌ల ద్వారా జరుగుతున్న నేపధ్యంలో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకోవటం పట్ల ఆపిల్ ఐఫోన్ ఇంకా ఐపోడ్ యూజర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా ఫేస్‌బుక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను సైతం ఆధునీకరించినట్లు సమాచారం. ఈ తాజా నవీకరణతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు సైతం ఫేస్‌బుక్ అప్‌డేట్‌లను త్వరితగతిన పొందుతారు.

ఫేస్‌బుక్‌లోని కామెంట్‌లను ఏలా ఎడిట్ చేయాలి..?

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ 800 మిలియన్‌ల యాక్టివ్ యూజర్లతో విరాజిల్లుతోంది. ఈ సైట్‌లోని ప్రతి యూజర్‌కు సగటున 200మంది స్నేహితులు ఉంటారు. ఫేస్‌బుక్ ద్వారా రోజుకు కొన్ని లక్షలు సంభాషణలు చోటుచేసుకుంటాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకన్న ఫేస్‌బుక్ యాజమాన్యం తాజాగా ‘ఎడిట్ కామెంట్ ఫీచర్’ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రాకముందు ‘కామెంట్‌ను ఎడిట్ చేసుకునేందుకు వీలు ఉండేది కాదు, డిలీట్ చేసి కొత్తది పోస్ట్ చెయ్యాల్సి వచ్చేది’. ఈ కొత్త అప్లికేషన్ రాకతో చేసిన కామెంట్‌లో ఏమైనా అక్షరదోషాలు తలెత్తితే ఎడిట్ చేసి రీపోస్ట్ చేసుకోవచ్చు.

కామెంట్‌ను ఎడిట్ చేసుకునే విధానం:

- ముందగా మీరు చేసిన కామెంట్ దగ్గరికి వెళ్లండి.

- కామెంట్ పై కర్సర్ పెట్టిన వెంటనే కుడిభాగంలో పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది.

- పెన్సిల్ ఐకాన్‌ను క్లిక్ చేసిన వెంటనే ‘ఎడిట్ ఆర్ డిలిట్’ ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది.

- ఎడిట్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి.

- అక్షరదోషాలను సవరించి తిరిగి మీ కామెంట్‌ను రీపోస్ట్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X