ఫేస్‌బుక్ లో COVID-19 వ్యాక్సిన్ ఫైండర్ టూల్!! టీకా కేంద్రాలను చూడడం మరింత సులువు

|

ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ సంస్థ ఫేస్‌బుక్ ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం కొత్తగా ఒక టూల్ ని ప్రారంభించింది. భారతదేశంలోని ఫేస్‌బుక్ వినియోగదారులు తమ యొక్క మొబైల్ యాప్‌లో COVID-19 వ్యాక్సిన్ కేంద్రాలను గుర్తించడం కోసం ఈ వ్యాక్సిన్ ఫైండర్ టూల్ ని రూపొందించడానికి భారత ప్రభుత్వంతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇది COVID-19 టీకాలను వేసుకోవడం కోసం మీ యొక్క సమీప ప్రదేశంలోని టీకా కేంద్రాలను గుర్తించడంలో ప్రజలకు సహాయపడుతుంది.

 

COVID-19

కొన్ని నివేదికల ప్రకారం ఈ వారం ప్రారంభంలో దేశంలోని COVID-19 పరిస్థితికి అత్యవసర ప్రతిస్పందన ప్రయత్నాల కోసం ఫేస్‌బుక్ సంస్థ 10 మిలియన్ (సుమారు రూ.74 కోట్లు) గ్రాంట్ ప్రకటించింది. ఫేస్‌బుక్ లోని ఈ వ్యాక్సిన్ ట్రాకర్ టూల్ వినియోగదారులకు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) షేర్ చేస్తున్న సమీప వ్యాక్సిన్ సెంటర్ స్థానాలను మరియు వారి పనిచేయు ఖచ్చితమైన సమయాలను కనుగొనటానికి అనుమతిస్తుంది.

ట్రాకర్ టూల్

ట్రాకర్ టూల్ కోవిన్ పోర్టల్‌లో నమోదు చేయడానికి మరియు టీకా నియామకాలను షెడ్యూల్ చేయడానికి కలిగిన లింక్‌తో పాటు వాక్-ఇన్ ఎంపికలను చూపుతూ ఉంటుంది. ఫేస్‌బుక్ తన ప్లాట్‌ఫామ్‌లోని ఒక పోస్ట్‌లో ఇలా రాసింది "భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో ఫేస్‌బుక్ తన వ్యాక్సిన్ ఫైండర్ టూల్ ని భారతదేశంలో ఫేస్‌బుక్ మొబైల్ యాప్‌లో 17 భాషల మద్దతుతో అందుబాటులో ఉంచడం ప్రారంభిస్తుంది.

ఫేస్‌బుక్
 

యునైటెడ్ వే, స్వాష్త్, హేమ్‌కంట్ ఫౌండేషన్, ఐ యామ్ గుర్గావ్, ప్రాజెక్ట్ ముంబై, మరియు యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం (USISPF) - NGOs మరియు ఏజెన్సీలతో కూడా చేతులు కలుపనున్నట్లు కంపెనీ తెలిపింది. 5,000 కి పైగా ఆక్సిజన్ సిలిండర్ల సాంద్రతలు మరియు వెంటిలేటర్లు, బీపాప్ యంత్రాలు వంటి ఇతర ప్రాణాలను రక్షించే పరికరాలతో క్లిష్టమైన వైద్య సామాగ్రిని అందించడం కోసం సహాయపడండి అని NGOs కూడా కోరాయి.

మాషబుల్ ప్రకారం ఫేస్బుక్ కూడా COVID-19 ఇన్ఫర్మేషన్ సెంటర్ మరియు ఫీడ్లో అత్యవసర సంరక్షణను ఎలా పొందాలో మరియు ఇంట్లో తేలికపాటి COVID-19 లక్షణాలను ఎలా నిర్వహించాలో వంటి సమాచారంను కలిగి ఉంటుంది. దీనిని యునిసెఫ్ ఇండియా అందిస్తుంది.

 

Most Read Articles
Best Mobiles in India

English summary
Facebook Newly Released COVID-19 Vaccine Finder Tool For India Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X