ఫేస్‌బుక్ న్యూస్ పబ్లిష్,ఏడాదికి 3 మిలియన్ల డాలర్లు

By Gizbot Bureau
|

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ నెటిజన్లను ఆకట్టుకోవడంలో ఎప్పటికప్పుడు ముందుకు దూసుకెళ్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా తన యూజర్లకు మరో లేటేస్ట్ ఫీచర్ అందించడానికి సిద్ధమవుతోంది. చాలామంది మొబైల్ ఫోన్లలోనే వార్తలను చదువుతున్న క్రమంలో ఆ దిశగా న్యూస్ అప్‌డేట్స్ అందించడానికి రెడీ అవుతోంది. అందులోభాగంగా త్వరలోనే ఫేస్‌బుక్ యాప్‌లో న్యూస్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వార్తలొస్తున్నాయి.

ఫేస్‌బుక్ న్యూస్ పబ్లిష్,ఏడాదికి 3 మిలియన్ల డాలర్లు

 

తమ ప్లాట్ ఫాంపై క్వాలిటీ న్యూస్ పబ్లిష్ చేస్తే మిలియన్ల డాలర్లు ఆఫర్ చేస్తోంది. పబ్లిషర్లు తమ మెటేరియల్స్ ను పబ్లిష్ చేసే అధికారం ఇస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై ఫేస్‌బుక్ సుధీర్ఘంగా చర్చలు జరుపుతోంది. ఎన్నో యేళ్లుగా ఆన్ లైన్ ప్రకటనల గుత్తాధిపత్యంపై పోరాడుతున్న వార్తా పరిశ్రమను దెబ్బ తీస్తుందనే విమర్శలు వస్తున్న తరుణంలో ఫేస్ బుక్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

ఏడాదికి 3 మిలియన్ల డాలర్లు

ఏడాదికి 3 మిలియన్ల డాలర్లు

లైసెన్స్‌ కలిగిన స్టోరీలు, హెడ్ లైన్స్ సహా ఇతర మెటేరియల్స్ పబ్లిష్ చేసినందుకు ఏడాదికి 3 మిలియన్ల డాలర్లు సుమారు (రూ.21.15కోట్లు) చెల్లించినట్టు ఫేసుబుక్ ప్రతినిధులు న్యూస్ ఎగ్జిక్యూటివ్‌లకు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ గురువారం నివేదించింది. దీనిపై స్పందించడానికి నిరాకరించిన ఫేస్‌బుక్. News Tabను లాంచ్ చేసే పనిలో ఉన్నట్టు ధృవీకరించింది.

ఏప్రిల్ నుంచే చర్చలు

ఏప్రిల్ నుంచే చర్చలు

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ న్యూస్ సెక్షన్ సర్వీసుకు సంబంధించి ఏప్రిల్ నుంచే చర్చలు ప్రారంభించారు. వాల్ స్ట్రీట్ జనరల్ స్టోరీస్‌కు లైసెన్స్ చెల్లించడం గురించి ఫేస్ బుక్ న్యూస్ కార్పొరేషన్‌ను సంప్రదించినట్టు ఈ విషయం తెలిసిన వ్యక్తి ఒకరు ధ్రువీకరించారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడటానికి తమకు అధికారం లేనందున ఆ వ్యక్తి పేరు చెప్పేందుకు నిరాకరించారు.

 స్పష్టత కరువు
 

స్పష్టత కరువు

ఫేస్‌బుక్ వ్యక్తిగత పబ్లిషర్లు వేర్వేరుగా 3 మిలియన్ల డాలర్లు ఆఫర్ చేస్తుందా లేదా మొత్తం అన్ని వార్తా సంస్థలకు కలిపి ఇస్తుందా అనేది జర్నల్ నివేదిక స్పష్టం చేయలేదు. వార్తా పరిశ్రమలో ఎంతో మంది తమ కంటెంట్‌ను ఉచితంగా వాడుకుంటున్నాయని ఫేస్ బుక్, గూగుల్ సంస్థలను నిందిస్తున్నారు. మరోవైపు సోషల్ నెట్ వర్క్ కూడా మెజార్టీ డిజిటల్ యాడ్స్ డాలర్స్ ను పైకి లేపడంతో వార్తా పరిశ్రమను భారీగా దెబ్బతీసింది.

 ఫేస్‌బుక్ మెసెంజర్‌లలో న్యూస్ ఫీచర్‌

ఫేస్‌బుక్ మెసెంజర్‌లలో న్యూస్ ఫీచర్‌

ఫేస్‌బుక్ కొన్ని వార్తా సంస్థలతో కలిసి న్యూస్ ఫీచర్‌ను తెరంగేట్రం చేయనుందనే టాక్ నడుస్తోంది. ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లలో న్యూస్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదలావుంటే న్యూస్ ఫీచర్‌ను మొదట అమెరికాలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యూజర్లను న్యూస్ ఫీచర్‌తో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది ఫేస్‌బుక్. ఆ క్రమంలో ఎప్పటకప్పుడు వార్తలను అప్‌డేట్ చేసేందుకు అక్కడి ప్రముఖ వార్తా సంస్థలతో టైఅప్ అవుతున్నట్లు సమాచారం. సంవత్సరం ప్యాకేజీగా మాట్లాడుకుని న్యూస్ ఫీచర్‌ను అద్భుతంగా అందించేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

వివరాలను ప్రకటించిన జుకర్‌బర్గ్

వివరాలను ప్రకటించిన జుకర్‌బర్గ్

దీని కోసం ఆయా వార్తా సంస్థలకు దాదాపు 3 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు ఫేస్‌బుక్ సంస్థ సిద్ధమైందట . అంతేకాదు దానికి అవసరమైన లైసెన్సులు కూడా తీసుకుని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ న్యూస్ ఫీచర్‌ కు సంబంధించిన వివరాలను ప్రకటించారు. అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా న్యూస్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందట.

Most Read Articles
Best Mobiles in India

English summary
Facebook offers publishers millions of dollars for rights to publish news on its site: Report

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X