ఫేస్‌బుక్‌లో మరో వైరస్, క్రోమ్ యూజర్లకు ముప్పు!

ఇంటర్నెట్‌తో టచ్‌లో ఉండే ప్రతి ఒక్కరికి ఫేస్‌బుక్ సుపరిచితం. ముఖ్యంగా నేటి యువతరం ఫేస్‌బుక్‌లో దూసుకుపోతోంది. ఈ సామాజిక సంబంధాల మాద్యమంలో ఎప్పటికప్పుడు తమ స్టేటస్‌లను అప్‌డేట్ చేసుకోవటం, మిత్రులకు టచ్‌లో ఉండటం, కొత్త మిత్రులను యాడ్ చేసుకోవటం, కామెంట్లు, ఫోటోలు పోస్ట్ చేస్తూ ఎన్ని లైకులు, షేర్లు, కామెంట్లు వచ్చాయో చూసుకోవడం నేటి ట్రెండుకు అలవాటుగా మారిపోయింది. యువత రోజువారీ కార్యకలాపాల్లో ఒక భాగమైపోయిన ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత సమాచారం కూడా లీకైపోతోంది.

Read More : కళ్లు చెదిరే ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!

ఫేస్‌బుక్‌లో మరో వైరస్, క్రోమ్ యూజర్లకు ముప్పు!

తాజాగా పేస్‌బుక్‌ను మరో ప్రమాదకర వైరస్ చుట్టిముట్టినట్లు తెలుస్తోంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో ఫేస్‌బుక్‌ను వాడుతోన్న యూజర్లను టార్గెట్ చేస్తూ ప్రమాదకర వైరస్‌తో కూడిన ఓ ప్లగిన్‌ను హ్యాకర్లు రంగంలోకి దింపినట్లు సమాచారం. నోటిఫికేషన్ రూపంలో యూజర్ అకౌంట్లలోకి ఈ వైరస్ ప్రవేశిస్తోందట. ఫ్రెండ్ ట్యాగ్ చేసినదిగా భావించి ఆ నోటిఫికేషన్ పై క్లిక్ చేసినట్లయితే రకరకాల వైరస్‌లు ఆటోమెటిక్‌గా పీసీలోకి డౌన్‌లోడ్ అయిపోయి యూజర్ కంట్రోల్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసేసుకుంటాయట.

Read More : ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?

ఫేస్‌బుక్‌లో మరో వైరస్, క్రోమ్ యూజర్లకు ముప్పు!

ప్రస్తుతానికి ఈ కామన్ ట్యాగింగ్ మాల్వేర్ సమస్యను గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో మాత్రమే గుర్తించామని, ఎడ్జ్, పైర్‌ఫాక్స్, సఫారీ, ఒపెరా బ్రౌజర్‌లలో ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని తెలుస్తోంది. క్రోమ్ బ్రౌజర్‌లో ఫేస్‌బుక్‌ను యూజ్ చేసే యూజర్లు నోటిఫికేషన్లను క్లిక్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More : సామ్‌సంగ్ నుంచి అలనాటి ఫ్లిప్ ఫోన్

ఫేస్‌బుక్‌లో మరో వైరస్, క్రోమ్ యూజర్లకు ముప్పు!

హ్యాకింగ్ సమస్య ఆన్‌లైన్ ప్రపంచాన్ని వేధిస్తున్న నేపధ్యంలో ఫేస్‌బుక్ యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. మీ ఫేస్‌బుక్ అకౌంట్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసుకునే క్రమంలో 10 విలువైన సూచనలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 విలువైన ఫేస్‌బుక్ సూచనలు, ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సినవి

మీ మొబైల్ నెంబర్ అడ్రస్ వంటి వివరాలను ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పెట్టకండి.

10 విలువైన ఫేస్‌బుక్ సూచనలు, ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సినవి

మీ ఈమెయిల్ ఐడీకి సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పెట్టకండి.

10 విలువైన ఫేస్‌బుక్ సూచనలు, ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సినవి

సాధ్యమైనంత వరకు keep me logged in పై టిక్ చేయకండి. ఈ చర్య అన్ని సందర్భాల్లో మంచిది కాదు.

10 విలువైన ఫేస్‌బుక్ సూచనలు, ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సినవి

పబ్లిక్ కంప్యూటర్‌ల నుంచి మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లలోకి లాగిన్ కావొద్దు.

10 విలువైన ఫేస్‌బుక్ సూచనలు, ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సినవి

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి friend requestలకు స్పందించకండి. వీటిని యాక్సప్ట్ చేయవల్సిన అవసరం లేదు. 

10 విలువైన ఫేస్‌బుక్ సూచనలు, ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సినవి

గుర్తుతెలియన వ్యక్తితో చాట్ చేస్తున్నప్పుడు చాట్ బాక్సులో మీ వ్యక్తిగత వివరాలను వారితో షేర్ చేసుకోకండి.

10 విలువైన ఫేస్‌బుక్ సూచనలు, ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సినవి

మీ అప్‌కమింగ్ హాలీడే ట్రిప్‌లకు సంబంధించిన వివరాలను మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేయకండి.

10 విలువైన ఫేస్‌బుక్ సూచనలు, ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సినవి

మీ ఫేస్‌బుక్ అకౌంట్లకు శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోండి (మీరు ఎంపిక చేసకునే పాస్‌‌వర్డ్‌లో అక్షరాలు ఇంకా విరామ చిహ్నాలు ఉండేవిధంగా జాగ్రత్త వహించండి).

10 విలువైన ఫేస్‌బుక్ సూచనలు, ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సినవి

ఫేస్‌బుక్ ఆకౌంట్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారి లాగ్ అవుట్ (Log out) చేయటం మరవద్దు.

10 విలువైన ఫేస్‌బుక్ సూచనలు, ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సినవి

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వినియోగిస్తోన్న మీ పీసీ లేదా స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్‌ను సాఫ్ట్‌వేర్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook on Alert Comment Tagging Malware Spreading via Google Chrome. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot