హానికర ఇమేజిలు వెంటనే తొలగించండి

Posted By:

హానికర ఇమేజిలు వెంటనే తొలగించండి

 

ఇంటర్నెట్లో ప్రస్తుతం హాల్ చల్ చేస్తున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో ఇటీవల కాలంలో అసహ్యామైన ఇమేజిలు ఎక్కువగా కనిపిస్తుండడంతో, ఢిల్లీ హైకోర్టు కొత్తగా ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్, ఆర్కూట్ వెబ్ సైట్‌లలో ఉన్న అసహ్యాకరమైన ఇమేజిలను వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ముఫ్లీ అజాజ్ అర్షద్ కుష్మి ఇటీవల ఢిల్లీ హైకోర్టులో తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇమేజిలు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో సంచరిస్తున్నాయంటూ పిటిషన్ వేయడం జరిగింది.

ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్డు అడ్మస్ట్రేటివ్ సివిల్ జడ్జి ముఖేష్ కుమార్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో అలాంటి ఇమేజిలు ఏమైనా  ఉంటే వాటిని వెంటనే తొలగించాల్సిందిగా కోరారు. అర్షద్ కుష్మి చూపించిన ఫోటోలు భారత దేశ  కమ్యూనిటీని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని, కాబట్టి అటువంటి పోటోలను వెంటనే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ నుండి వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot