స్మార్ట్ ఫోన్స్‌లో త్వరలో ఫేస్‌బుక్ పేజీలు

Posted By: Prashanth

స్మార్ట్ ఫోన్స్‌లో త్వరలో ఫేస్‌బుక్ పేజీలు

 

కాలిఫోర్నియా: సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 'మైక్ హాఫింజర్' మాట్లాడుతూ 2012వ సంవత్సరంలోనే ఫేస్‌బుక్‌కు సంబంధించిన పేజీలు స్మార్ట్ ఫోన్స్‌లలో దర్శనమివ్వనున్నట్లు తెలిపారు. ఫేస్‌బుక్ విడుదల చేసే ఆఫర్స్ కంపెనీలకు ఎలా ఉపయోగపడుతున్నాయంటే వినియోగదారులకు వారియొక్క కంపెనీలకు సంబంధించి ప్రమోషన్స్ పంపేందుకు సహాయపడనున్నాయి.

దీనితో పాటు ఫేస్‌బుక్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన 'రీచ్ జనరేటర్' సర్వీసు ద్వారా ఫేస్‌బుక్‌లో ఉన్న ఎక్కువ మంది అభిమానులను కంపెనీలు చేరువయ్యేందుకు అవకాశాన్ని కల్పించాయి. ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్ యూజర్స్‌ని కలిగి ఉన్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ స్మార్ట్ ఫోన్స్‌లలో ఫేస్‌బుక్ పేజీలను ప్రదర్శించడం వల్ల ఇంకా ఎక్కువ మంది యూజర్స్‌ని సొంతం చేసుకునే భాగంలో ఓ ప్రక్రియగా అభివర్ణిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot