వీడని ఫేస్‌బుక్ నిర్లక్ష్యవైఖరి, 41.9 కోట్ల మంది డేటా లీక్

By Gizbot Bureau
|

వినియోగదారుల సమాచార భద్రత విషయంలో ఫేస్ బుక్ నిర్లక్ష్యవైఖరిని వీడటం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు యూజర్ల డేటా బయటకు వెళ్లినప్పటికీ సర్వర్లు, ఎన్ క్రిప్షన్ల విషయంలో ఏ మాత్రం జాగ్రత్త వహించడం లేదు. గతేడాది కేంబ్రిడ్జి అనలిటికా వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ ప్రకంపనల ఛాయలు ఇంకా తొలగనే లేదు. తాజాగా ఫేస్‌బుక్ మరో వివాదంలో చిక్కుకుంది. ఫేస్‌బుక్‌ సర్వర్లలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా 41.9 కోట్ల మంది యూజర్ల వివరాలు బయటకు పొక్కాయని టెక్‌ క్రంచ్‌ అనే మీడియా సంస్థ తెలిపింది.

41.9 కోట్ల మంది యూజర్ల వివరాలు

4.9 కోట్ల యూజర్ల ఇన్ స్టాగ్రామ్ పాస్ వర్డ్ లు బయటకు వెళ్లిన ఘటన మరువక ముందే ఫేస్ బుక్ లో మరో డేటా చోరీ జరిగింది. ఫేస్ బుక్ సర్వర్లలో ఎటువంటి ఎన్ క్రిప్షన్ లేకుండా ఉన్న ఒక డేటాబేస్ నుంచి సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. అందులో 41.9 కోట్ల మంది యూజర్ల వివరాలు ఉన్నట్లు సమాచారం. ఇందులో 13.3 కోట్ల మంది అమెరికన్లు ఉండగా, 5 కోట్ల మంది వియత్నామీలు, 1.8 కోట్ల మంది బ్రిటిషర్లు ఉన్నారని టెక్‌ క్రంచ్‌ అనే మీడియా వెల్లడించింది. 

ఈ ఘటనలో యూజర్ల ఫోన్‌ నంబర్లు, లింగం, నివాస ప్రాంతం తదితర వివరాలు బయటకు వచ్చేశాయని పేర్కొంది. సంబంధిత ఫేస్‌బుక్‌ సర్వర్‌కు పాస్‌వర్డ్‌ రక్షణ లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందనీ, దీనివల్ల ఎవరైనా ఈ సర్వర్‌ నుంచి యూజర్ల పూర్తివివరాలను తీసుకునేందుకు వీలుకలిగిందని చెప్పింది. ఈ విషయాన్ని తాము ఫేస్‌బుక్‌ దృష్టికి తీసుకొచ్చామని తెలిపింది. 

ఫేస్‌బుక్‌ స్పందన

మరోవైపు ఈ విషయమై ఫేస్‌బుక్‌ స్పందిస్తూ.. దాదాపు 20 కోట్ల యూజర్ల వివరాలు బయటపడ్డాయనీ, ఈ సమాచారమంతా చాలా పాతదని వివరణ ఇచ్చింది. అంతేకాకుండా లీకైన డేటాలో చాలా వరకు డూప్లికేట్ డేటా ఉందని, బయటకు వచ్చిన వార్తల్లో ఉన్నంత డేటా లీకవ్వలేదని పేర్కొన్నారు. ఫేస్ బుక్ యూజర్లు భయపడక్కర్లేదని, ఫేస్ బుక్ ఖాతాలకు సంబంధించిన సమాచారం లీకైనట్లు ఎటువంటి సమాచారం లేదని ఫేస్ బుక్ పేర్కొంది.

మొబైల్ నంబర్ దుర్వినియోగం 

ఇప్పటికే చాలా సార్లు ఇలాంటి డేటా లీక్ లు జరగడం ఇకపై జరగకుండా చూసుకుంటామని, భద్రత పెంచుతామని ఫేస్ బుక్ సర్దిచెప్పుకోవడం వంటి సంఘటనలు జరిగాయి. ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వినియోగదారులు ఫేస్ బుక్ మీద పూర్తిస్థాయిలో కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు లీకైన డేటాలో మొబైల్ నంబర్లు కూడా ఉండటంతో సిమ్ స్వాపింగ్ వంటి అక్రమ పద్ధతులతో మొబైల్ నంబర్ ని దుర్వినియోగం చేయడం, ఫోన్ నంబర్లకి స్పామ్ కాల్స్ చేయడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

Best Mobiles in India

English summary
A huge database of Facebook users’ phone numbers found online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X