ఫేస్‌బుక్ వల్ల తన కుమారుడి ప్రాణాలు నిలబడ్డాయంటున్న ఓ తండ్రి

Posted By: Staff

ఫేస్‌బుక్ వల్ల తన కుమారుడి ప్రాణాలు నిలబడ్డాయంటున్న ఓ తండ్రి

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌గా మంచి ప్రాచూర్యం పొందింది. లుకేమియా (రక్తహీనత)తో బాధపడుతున్న ఓ నాలుగేళ్ల బాలుడిని కాపడడంలో సహాయపడింది. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ బాలుడిని చూసి విచారించిన తండ్రి అతని పోటో ఫేస్‌బుక్‌లో ఉంచాడు. అనస్థీసియాటిక్‌ అసిస్టెంట్‌గా పనిచేసే ఫిలిప్ రైస్ తన కుమారుడు టెడ్ శరీరమంతా ఎర్రటి పొక్కులు ఏర్పడటం చూసి మంచంపై పడుకోబెట్టి ఒక ఫోటో తీసి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో ఉంచాడు.

ఈ ఫోటోను కొన్ని నిమిషాల్లోనే ఒక వైద్య మిత్రుడు చూసి ఒక సలహా ఇచ్చారు. ఈ తరహా పొక్కులు లుకేమియాకు రావడానికి సూచికలుగా గుర్తించి టైడ్ వెంటనే హాస్పటల్‌కు తీసుకెళ్లమని అతని తండ్రికి సూచించినట్లు డైయిలీ ఎక్స్‌ప్రెస్ పత్రిక తెలిపింది. ఇప్పడు ఆ బాలుడికి కీమోథెరపీ చికిత్సను ప్రారంభించాడు. 34 ఏళ్ల రైస్ గ్రేటర్ మాంచెస్టర్‌లోని రాయల్ సాల్ఫోర్డ్ హాస్పటల్‌లో పనిచేసే తన వైద్య మిత్రుడు డాక్టర్ సారా బార్టన్‌యే తన కుమారుడి ప్రాణం కాపడినట్లు చెబుతున్నాడు. ఫిలీప్ తన కుమారుడి పరిస్థితిని పేస్‌బుక్‌లో తెలియజేశాడని దానిని అధ్యయనం చేసిన తాను అతను లుకేమియాతో బాధపడుతున్నట్లు గుర్తించి ఫిలీప్‌ను అలర్ట్ చేసినట్లు డాక్టర్ బాటన్ చెబుతున్నాడు.

రైస్ తన కుమారుడు పూర్తిగా కోలుకోని సెప్టెంబర్‌లో పార్ట్‌టైమ్‌గా పాఠశాలకు వెళ్తాడని భావిస్తున్నాడు. టెడ్ ప్రస్తుతం వీల్‌ఛైర్‌లో ఉండి కీమోథెరఫీ తీసుకుంటున్నాడు. టైడ్ కుటుంబమంతా ప్రస్తుతం టైడ్‌కు సహాయం చేసిన ద రైన్భో ట్రస్ట్‌కు నిధుల సేకరణలో ఉన్నారు. తమకు చుట్టుప్రక్కల వారి నుంచి మంచి సహకారం లభించిందని అందరికి తాము ఋణపడి ఉన్నామని రైస్ చెబుతున్నాడు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting