ఫేస్‌బుక్ నుంచి డబ్బులు పంపవచ్చు, ఎలాగో తెలుసుకోండి

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ సరికొత్తగా ముందుకు దూసుకువస్తోంది. ఎంతలా అంటే తన సొంత కరెన్సీని తయారు చేసుకునేంతగా. ఏంటీ నమ్మలేకున్నారా.. కొన్ని నమ్మితీరాల్సిందే. ఫేస్‌బుక్ 2020 నాటికి

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ సరికొత్తగా ముందుకు దూసుకువస్తోంది. ఎంతలా అంటే తన సొంత కరెన్సీని తయారు చేసుకునేంతగా. ఏంటీ నమ్మలేకున్నారా.. కొన్ని నమ్మితీరాల్సిందే. ఫేస్‌బుక్ 2020 నాటికి తన సొంత క్రిప్టోకరెన్సీని లాంచ్ చేపేందుకు ప్లాన్ చేస్తోంది. తద్వారా 12 దేశాల్లో డిజిటల్ పేమెంట్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఫేస్‌బుక్ నుంచి డబ్బులు పంపవచ్చు, ఎలాగో తెలుసుకోండి

ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా ఫేస్‌బుక్ వినియోగదారులు ప్రపంచ దేశాల్లో ఉన్న కరెన్సీతో మన దేశ కరెన్సీని మార్చకకోవచ్చు. ఈ డిజిటల్ కాయిన్స్ ద్వారా మీరు ఈ దేశ కరెన్సీని అయినా మార్చుకునే అవకాశం ఉంది. ఈ కాయిన్స్ మీరు షాపింగ్ అవుట్ లెట్స్ వంటి వాటిల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి బ్యాంకు అకౌంట్ అవసరం లేదు.

12దేశాల్లో అమలు

12దేశాల్లో అమలు

గూగుల్ పే, ఫోన్ పే.. లానే ఫేస్ బుక్ కూడా నగదు లావాదేవీలు చేసే సౌకర్యాన్ని తీసుకురానుంది. 2020 మార్చి నాటికి దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు జుకర్ బర్గ్ వెల్లడించారు. ముందుగా ఈ సదుపాయాన్ని 12దేశాల్లో అమలు చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్ యూజర్లకు త్వరలోనే అందించనున్నారు.
బిబిసి రిపోర్ట్ ప్రకారం ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ గత నెలలో Bank of England గవర్నర్ Mark Carneyని కలిసి ఈ ప్లాన్ గురించి చర్చించారు. యుఎస్ అఫిషియల్స్ కూడా దీన్ని ధృవీకరించారు. లిబ్రా పేరుతో ఈ ప్రాజెక్ట్ రాబోతోందని దీని ద్వారా కరెన్సీని మార్చుకునే అవకాశం ఫేస్‌బుక్ కల్పిస్తోందని అధికారులు చెబుతున్నారు.

 

 

  ఫేస్‌బుక్ ఆహ్వానం

ఫేస్‌బుక్ ఆహ్వానం

ఇప్పటికే దీనిపై ప్రాజెక్టు రెడీ చేసుకున్నఫేస్‌బుక్ యాజమాన్యం సంబంధిత అధికారులను కలిసి చర్చించింది. 'నగదు లావాదేవీలు సులభతరం చేయడానికి ఇదొక అవకాశం. ఫేస్‌బుక్‌లో ఫొటో పంపినంత సులువుగా డబ్బు పంపుకోవచ్చు' అని జూకర్ బర్గ్ వెల్లడించారు.
కరెన్సీ ఒక్కో దేశంలో వేర్వేరు రూపాల్లో వేర్వేరు విలువలతో ఉంటుంది. దానిని కూడా సమన్వయం చేసుకునేలా దీనిని రూపొందించనున్నారు. యూఎస్ డాలర్, జపనీస్ యెన్, యూరోలు ఇలా అన్నింటికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. మార్కెట్‌లోకి తీసుకురాకముందే దీని కోసం పెట్టుబడిదారులను, ఎడ్వర్టైజ్‌మెంట్‌లను ఫేస్‌బుక్ ఆహ్వానం పంపింది. ఆన్‌లైన్ షాపింగ్, రిటైలర్‌ల నుంచి యాడ్‌లు ముందుగానే బుక్ చేసుకోవచ్చంటూ తెలిపింది.

2.4 billion monthly users

2.4 billion monthly users

ఇప్పుడు ఫేస్‌బుక్ కు ప్రపంచవ్యాప్తంగా 2.4 billion monthly users ఉన్నారు. వీరంతా ఈ కాయిన్స్ ను వాడుతారని కంపెనీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. వీరంతా రోజులవారీగా ఫోటోలు ఎలా పంపుకుంటున్నారో అలాగే ఈ డిజిటల్ కరెన్సీ కాయిన్స్ కూడా పంపుకోవచ్చని తెలిపారు.

మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్,
ఇదిలా ఉంటే ఫేస్‌బుక్ సీఈఓగా సంస్థ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తప్పుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్.. జుకర్ బర్గ్ స్థానే ఫేస్ బుక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ మాజీ సెక్యూరిటీ అధికారి అలెక్స్ స్టామోస్ బయటపెట్టారు.

 

ఫేస్ బుక్ సంస్థకు వ్యతిరేకంగా

ఫేస్ బుక్ సంస్థకు వ్యతిరేకంగా

ఫేస్‌బుక్‌లో జుకర్‌బర్గ్‌కు అవసరాన్ని మించిన అధికారం ఉన్నదని, దీన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉన్నదని స్టామోస్ తెలిపారు. ఫేస్‌బుక్‌లో ఉత్పత్తులను ఎలా నిర్మించాలన్నా, తయారు చేయాలన్న సంస్థలో ఇంటర్నల్ రివల్యూషన్ అవసరం ఉన్నదని స్టామోస్ చెప్పారు.ఫేస్ బుక్ సంస్థకు వ్యతిరేకంగా వచ్చిన ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా పోరాడిన స్టామోస్... గతేడాది ఆగస్టులో సంస్థను వీడారు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో పూర్తికాలం టీచర్‌గా, రీసెర్చర్‌గా చేరిపోయారు.

ఫేస్ బుక్ విభజన వల్ల

ఫేస్ బుక్ విభజన వల్ల

అయితే ఇటీవల ఫేస్ బుక్ కో ఫౌండర్లలో ఒకరైన చిరిస్ హుగెస్.. మార్క్ జుకర్ బర్గ్‌ను అక్కౌంటబుల్‌గా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, సోషల్ నెట్ వర్కింగ్ జెయింట్‌ను విడగొట్టాల్సిన అవసరం ఉందని కూడా వ్యాఖ్యానించారు. చిరెస్ హుగెస్ వ్యాఖ్యలపై ప్రస్తుతం చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్న సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెర్ల్య్ శాండ్ బర్గ్ తోసిపుచ్చారు. ఫేస్ బుక్ విభజన వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని తేల్చేశారు.పలువురు అమెరికా సెనెటర్లు కూడా ఫేస్ బుక్ ను విడగొట్టాలన్న ప్రతిపాదనలు తెచ్చారు. వారిలో ఇండో అమెరికన్ సెనెటర్ కమలా హరీస్ కూడా ఉన్నారు.

Best Mobiles in India

English summary
facebook plans to launch globalcoin cryptocurrency in 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X