బ్లాక్ చేసిన వారు మళ్లీ అన్‌బ్లాక్ లోకి, ఎఫ్‌బిలో మరో బగ్ !

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్‌‌కు కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఈ మధ్య డేటా స్కాండల్‌ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిర అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో స్కాండల్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది స్కాండల్ అనడం కన్నా బగ్ లోపం అనే చెప్పాలి. కొత్తగా సాఫ్ట్‌వేర్‌ బగ్‌ ని Facebookలో కనుగొన్నారు. దీని ద్వారా బ్లాక్ లిస్ట్ లో ఉన్నవారు అన్‌బ్లాక్ లోకి వస్తున్నారని తెలుస్తోంది.

 

ఈ భూమి మీద బతకలేను,ఫేస్‌బుక్ లైవ్‌ ద్వారా సూసైడ్ఈ భూమి మీద బతకలేను,ఫేస్‌బుక్ లైవ్‌ ద్వారా సూసైడ్

ఫేస్‌బుక్‌కి డేటా స్కాండల్‌తో పాటు..

ఫేస్‌బుక్‌కి డేటా స్కాండల్‌తో పాటు..

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కి డేటా స్కాండల్‌తో పాటు, కొన్ని సాఫ్ట్‌వేర్‌ బగ్స్‌ కూడా ఫేస్‌బుక్‌కు కొరకరాని కొయ్యగా మారుతున్నాయి.తాజాగా మరో సాఫ్ట్‌వేర్‌ బగ్‌ వెలుగులోకి వచ్చింది.

8 లక్షల మందికి పైగా యూజర్లు

8 లక్షల మందికి పైగా యూజర్లు

8 లక్షల మందికి పైగా యూజర్లు ఈ బగ్‌ బారిన పడ్డారని, ఈ బగ్‌ యూజర్లు బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న వారిని, అన్‌బ్లాక్‌ చేస్తుందని తెలిసింది. దీని బారిన పడిన వారిలో ఫేస్‌బుక్‌ యాప్‌ యూజర్లు, మెసేంజర్‌ యాప్‌ యూజర్లు ఉన్నారని కంపెనీ తెలిపింది.

 మే 29 నుంచి జూన్‌ 5 వరకు
 

మే 29 నుంచి జూన్‌ 5 వరకు

మే 29 నుంచి జూన్‌ 5 వరకు ఈ బగ్‌ యాక్టివ్‌లో ఉందని ఫేస్‌బుక్‌ ధృవీకరించింది. ఎవరినైనా బ్లాక్‌లో పెట్టే సామర్థ్యం కలిగి ఉండటం చాలా ముఖ్యమైనదని ఫేస్‌బుక్‌ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ ఎరిన్‌ ఇగాన్‌ చెప్పారు.

బ్లాక్‌ చేసిన వారి ప్రొఫైల్‌ చూడకుండా..

బ్లాక్‌ చేసిన వారి ప్రొఫైల్‌ చూడకుండా..

కాగా బ్లాక్‌ చేసిన వారి ప్రొఫైల్‌ చూడకుండా ఉండే సౌకర్యాన్ని ఫేస్‌బుక్‌ కల్పిస్తోంది. ఒక ఫ్రెండ్‌గా కనెక్ట్‌ అయిన తర్వాత, వారి ప్రవర్తన నచ్చకపోతే వారిని ఆటోమేటిక్‌గా ‘అన్‌ఫ్రెండ్స్‌' లో పెట్టేయొచ్చు.

సంబంధాలు తెగిపోవడం..

సంబంధాలు తెగిపోవడం..

సంబంధాలు తెగిపోవడం లేదా నచ్చని కంటెంట్‌ను వారు పోస్టు చేస్తూ ఉండటం ఇలాంటి పలు కారణాలతో ఫేస్‌బుక్‌ యూజర్లను బ్లాక్‌ చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. వేధింపుల కారణంతో కూడా కొంతమంది యూజర్లను బ్లాక్‌ చేస్తుంటారని తెలిపింది.

యూజర్లకు నోటిఫికేషన్లు

యూజర్లకు నోటిఫికేషన్లు

8 లక్షల మందికి పైగా యూజర్లు దీని బారిన పడ్డారని, ఈ బగ్‌ ప్రభావితమైన యూజర్లకు నోటిఫికేషన్లు వస్తాయని కంపెనీ తెలిపింది. నోటిఫికేషన్‌ వచ్చిన అనంతరం బ్లాక్డ్‌ జాబితాను యూజర్లు ఒక సారి చెక్‌ చేసుకోవాల్సిందిగా సూచించింది.

ఈ ఏడాది ప్రారంభంలో..

ఈ ఏడాది ప్రారంభంలో..

ఈ ఏడాది ప్రారంభంలో కూడా కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే తన సంస్థకు, డేటా షేర్‌ చేసిన స్కాండల్‌లో ఫేస్‌బుక్‌ భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కొంది.

Best Mobiles in India

English summary
Facebook privacy bug temporarily unblocked people from users’ block list more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X