ఫేస్‌బుక్ యూజర్లు 100కోట్లు పైనే!, 60కోట్ల మంది మొబైల్ ద్వారానే?

Posted By: Staff

ఫేస్‌బుక్ యూజర్లు 100కోట్లు పైనే!, 60కోట్ల మంది మొబైల్ ద్వారానే?

 

న్యూయార్క్: ప్రపంచపు అతిపెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘ఫేస్‌బుక్’ 100కోట్ల పై చిలుకు సభ్యులతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫేస్‌బుక్‌ను ప్రపంచవ్యాప్తంగా 200దేశాల్లో వినియోగించుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ అంశం పై స్పందించిన సంస్థ సహావ్యవస్థాపకులు, సీఈవో మార్క్ జూకర్ బర్గ్ తమ సైట్ ద్వారా 100 కోట్ల మంది కమ్యూనికేషన్ బంధాలను సాగించటం ఆనందాశ్చర్యాలు కలిగించే అంశమని, నా జీవితంలో అత్యంత గర్వించదగిన క్షణమని అభిప్రాయపడ్డారు.

2004లో ప్రారంభమైన ఫేస్‌బుక్ ఆరేళ్లలో 50 కోట్ల మైలురాయిని చేరుకోగా, ఆ తర్వాత రెండేళ్ల వ్యవధిలోనే అంతుకు రెట్టింపు స్థాయికి ఎదిగింది. ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న వారిలో 22 సంవత్సరాల వయస్కలు అధికం. ఫేస్‌బుక్‌కు భారత్‌లో 25 మిలియన్లకు పైగా సభ్యులున్నారు. బ్రెజిల్, ఇండియా, ఇండొనేషియా. మెక్సికో, అమెరకాలు దీనికి ఐదు అతిపెద్ద మార్కెట్లుగా పేరొందాయి. 60 కోట్ల మంది సభ్యులు తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా ఈ వెబ్‌సైట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. 2012లో పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన ఈ సంస్థ 100 మిలియన్ల డాలర్లమేర స్పందనతో భారీ ఐపీవోల్లో ఒకటిగా నిలిచింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting