కౌంటింగ్ మొదలైంది, ఫేస్‌బుక్ యూజర్లు 750 మిలియన్లు

Posted By: Super

కౌంటింగ్ మొదలైంది, ఫేస్‌బుక్ యూజర్లు 750 మిలియన్లు

కాలిఫోర్నియా: ఫేస్‌బుక్ త్వరలో గూగుల్ ప్లస్ కాంపిటేషన్ తట్టుకోవడానికి ఫేస్‌బుక్లో వీడియో ఛాట్‌ని ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ఫౌండర్ సిఈవో మార్క్ జుకర్స్ బర్గ్ మాట్లాడుతూ ఫేస్‌బుక్ యూజర్స్ కోసం కొత్త కొత్త ఫీచర్స్‌ని అందులో పోందుపరచడం జరుగుతుంది. ఇప్పటివరకు ప్రపంచం మొత్తం మీద ఫేస్‌బుక్‌ని 750మిలియన్ జనాభా వినియోగిస్తున్నట్లు తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో ఫేస్‌బుక్ యూజర్ గ్రోత్ రేటు బాగా పెరిగిందని అన్నారు.

ప్రపంచంలో ఇప్పటి వరకు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో నెంబర్ వన్ స్దానాన్ని కొనసాగిస్తున్న ఫేస్‌బుక్ భవిష్యత్తులో అదే విధంగా కొనసాగించడం కోసమే ఫేస్‌బుక్లో కొత్త కొత్త పీచర్స్‌ని పోందుపరచడంతో పాటు యూజర్స్‌కి కొత్త ఎక్స్ పీరయన్స్‌ని కలగజేయడంలో ఎప్పడూ ఫేస్‌బుక్ ముందు ఉంటందని తెలిపారు. ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనీర్స్‌లో జూకర్స్ బర్గ్ అతి చిన్న వయసు వాడు కావడం విశేషం. ఈ సందర్బంలో జూకర్స్ బర్గ్ ఫేస్‌బుక్ అభివృద్ది రేటుని ప్రస్తావిస్తూ గత కొంత కాలంగా ఫేస్‌బుక్‌పై వచ్చినటువంటి నెగిటివ్ అభివృద్ది రేట్స్‌ని దృష్టిలో పెట్టుకోని యూజర్స్‌కు మెరుగైన మరిన్ని ఫీచర్స్‌ని అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఈవీడియో ఛాట్‌ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు.

ఏప్రిల్ 2010లో 20మిలియన్ యూజర్స్ ఉన్న అమెరికాలో 2011 ఏప్రిల్‌కి వచ్చేసరికే దాదాపు 6మిలియన్ యూజర్స్‌ని కొల్పోవడం జరిగింది. దాంతో అమెరికాలో ఏప్రిలో 2011వ సంవత్సరానికి ఫేస్‌బుక్ అభివృద్ది రేటు గణనీయంగా తగ్గిపోవడం జరిగిందని తెలిపారు. ఫేస్‌బుక్ త్వరలో తన ఫ్లాట్ ఫామ్‌లో ప్రతిపాదించనున్న వీడియో చాటింగ్ స్కైపీతో కలసి సంయుక్తంగా నిర్వహిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot