ఫేస్‌బుక్ ఛీ అన్నందుకే Google + 1బటన్ ప్రవేశపెట్టాం...

Posted By: Staff

ఫేస్‌బుక్ ఛీ అన్నందుకే Google + 1బటన్ ప్రవేశపెట్టాం...

గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎరిక్ స్కెమ్‌డిట్ మాట్లాడుతూ ప్రపంచంలో కెల్లా అతి పెద్దదైన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌తో మేము పర్సనల్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఐతే ఈ విషయంలో ఫేస్‌బుక్‌ మా పాట్నర్ షిప్‌ని తిరస్కరించడం జరిగింది. ఈ విషయాన్ని ఎరిక్ స్కెమ్‌డిట్ డి9 కాన్ఫరెన్స్‌లో వెల్లడించడం జరిగింది.

ఫేస్‌బుక్ పర్సనల్ డేటాని గనుక గూగుల్ సెర్చ్ ఇంజన్ ద్వారా సెర్చ్ రిజల్ట్స్‌తో చూపించినట్లైతే గూగుల్ సెర్చ్ ఇంజన్‌కి మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ ఒప్పందానికి అంగీకరించడం జరిగింది. ఫేస్‌బుక్‌‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి మేము చాలా గట్టిగా ట్రై చేయడం జరిగింది. కానీ ఫేస్‌బుక్ ఈ నిర్ణయాన్ని చాలా సున్నితంగా తిరస్కరించింది. అంతేకాకుండా గూగుల్ విడుదల చేసినటువంటి సమాచారం ప్రకారం మైక్రోసాప్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్ కూడా ఫేస్‌బుక్‌‌తో కలవాలని ఆశపడుతున్నట్లు వెల్లడించింది. ఐతే బింగ్ సెర్చ్ రిజల్డ్స్‌లో ఫేస్‌బుక్ పర్సనల్ డేటా కనిపించకపోయినప్పటికీ సోషల్ ఫీచర్స్ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ వెల్లిడించింది.

గూగుల్ స్వంతంగా సోషల్ నెట్ వర్కింగ్‌ని తీసుకోని రావాలని ప్రతిపాదించినప్పటికీ, దీనిపై నెటిజన్స్ అంత ఆశక్తి కనపర్చడం లేదని సమాచారం. ఈ సందర్బంలో ఎరిక్ స్కెమ్‌డిట్ మాట్లాడుతూ నేను సిఈవోగా ఉన్నప్పుడు ఫెయిల్ అయినటువంటి ఒకే ఒక సెక్షన్ ఈ సోషల్ నెట్ వర్కింగేనని ఒప్పుకున్నారు. దీంతో సెర్చ్ రిజల్డ్స్‌లో ది బెస్ట్ సెర్చ్ రిజల్డ్స్ ఇవ్వడం కోసం గూగుల్ + 1 బటన్‌ని తయారు చేసింది. ఫేస్‍బుక్ యూజర్లు అయితే కనుక మీకు Like గురించి తెలిసే ఉంటుంది, అటువంటిదే Google + 1 (ప్లస్ ఒన్) బటన్ కూడా. గూగుల్ లో మనం సెర్చ్ చేసినప్పుడు వచ్చే సెర్చ్ రిజల్ట్స్ లో వెబ్ పేజీల ప్రక్కన ఈ +1 బటన్ వస్తుంది, దాని పై క్లిక్ చేస్తే "I Like This Page" అని చెప్పినట్లే మరియు ఆ పేజీని మనం రికమెండ్ చేస్తున్నట్లు పబ్లిక్ గూగుల్ ప్రొపైల్ లో చూపుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot