ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌ల కోసం ఫేస్‌బుక్ కొత్త యాప్

Posted By:

ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఓఎస్ ఫోన్‌లను సపోర్ట్ చేసే విధంగా ‘స్టిక్కరిడ్' (Stickered) పేరుతో సరికొత్త స్టిక్కర్ యాప్‌ను ఫేస్‌బుక్ విడుదల చేసింది. ఈ యాప్‌‍లోని స్టిక్కర్‌లను మీరు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో అప్‌లోడ్ చేయబోయే ఫోటోల పై సందర్భాన్ని బట్టి ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌ల కోసం ఫేస్‌బుక్ కొత్త యాప్

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

రోజుకు 10 బిలియన్‌లకు పైగా మెసేజ్‌లు ఫేస్‌బుక్ ద్వారా బట్వాడా కాబడుతున్న నేపధ్యంలో ఈ ఫోటో స్టిక్కర్ యాప్ మరింత ఉపయుక్తం కానుందని ఫేస్‌బుక్ భావిస్తోంది. ఫేస్‌బుక్ మొబైల్ డిజైన్ యూనిట్ క్రియేటివ్ ల్యాబ్స్ ఈ యాప్‌ను డిజైన్ చేసినట్లు టెక్‌క్రంచ్ తెలిపింది.

భారత్‌లో ఫేస్‌బుక్ హవా

భారత్‌లో తమ యూజర్ల సంఖ్య ఈ ఏడాది సెప్టంబర్ నాటికి 11.2 కోట్లకు పెరిగిందని ఫేస్‌బుక్ వెల్లడించింది. తమకు అత్యధిక యూజర్ బేస్‌ను కలిగి ఉన్న దేశాల్లో అమెరికా తరువాతి స్థానాన్ని భారత్ దక్కించుకుందని ఫేస్‌బుక్ ఇండియా ఎండీ కీర్తిగా రెడ్డి తెలిపారు.

ఇంటర్నెట్ విస్తరణ, యువత అత్యధికంగా స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను ఆస్వాదించటం వంటి అంశాలు ఈ ఎదుగుదలకు దోహదపడ్డాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 135 కోట్ల మంది యూజర్లు ఉన్నారని, వారిలో డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 86.4 కోట్లని తెలిపారు.

భారత్‌లో ఫేస్‌బుక్ అకౌంట్‌లను కలిగి ఉన్న 112 మిలియన్‌ల మంది యూజర్లలో 99 మిలియన్ల మంది తమ ఫోన్‌ల నెలకు ఒకసారైన ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారని, 4.5 కోట్ల మంది యూజర్లు ద్వారా ప్రతి రోజూ ఫేస్‌బుక్‌కు కనెక్ట్ అవుతున్నారని కీర్తిగా రెడ్డి వివరించారు.

English summary
Facebook Releases iOS And Android App That Places Emoji Stickers On Your Photos. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting