బీ అలర్ట్, ఏరివేతను షురూ చేసిన ఫేస్‌బుక్

By Gizbot Bureau
|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ ఏరివేత కార్యక్రమాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా వాడకుండా అలాగే తప్పుడు సమాచారంతో నడుపుతున్న ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను పూర్తిగా తొలగిస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫేక్ అకౌంట్లు, పేజీలను తొలగించినట్లుగా తెలుస్తోంది.

Facebook removes thousands of fake pages, accounts

థాయిలాండ్, యూఎస్‌లో ఫేక్ అకౌంట్లపై, అనుమానాస్పద అకౌంట్లపై కన్నేసిన ఫేస్‌బుక్ తమ ప్లాట్ ఫాంలైన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో ఉండే మల్టీపుల్ పేజీలను తొలగిస్తోంది. ఇప్పటికే థాయ్‌లాండ్, రష్యా, ఉక్రేయిన్, హుండారస్ కేంద్రంగా నిర్వహించే ఫేక్ అకౌంట్లను ఫేస్‌బుక్ తొలగించింది. ఇప్పటివరకూ 12 ఫేస్ బుక్ అకౌంట్లు, 10 పేజీలను డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది.

 తప్పుదోవ పట్టించేలా

తప్పుదోవ పట్టించేలా

కాగా తొలగించిన అకౌంట్లలో క్యాంపియన్స్ మధ్యలో ఎలాంటి లింక్స్ గుర్తించలేదు. కానీ, క్రియేట్ చేసిన అన్ని రకాల నెట్ వర్క్ అకౌంట్లు ఇతరులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని గుర్తించినట్టు సైబర్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నాథనెయిల్ గ్లెచర్ తెలిపినట్టు ఫేస్‌బుక్ బ్లాగ్ పోస్టులో పేర్కొంది. ఉక్రేయిన్‌లో ఎన్నికలకు ముందు ఫేస్‌బుక్ 18 అకౌంట్లతో పాటు 9 పేజీలు, 3 గ్రూపు పేజీలను తొలగించింన సంగతి విదితమే.

రష్యాలో ప్రారంభం

రష్యాలో ప్రారంభం

ఈ ఏరివేత కార్యక్రమాన్ని ముందుగా రష్యాలో ప్రారంభించి ఆ తర్వాత ఉక్రేయిన్‌పై తన దృష్టిని పెట్టింది. ఉక్రేయిన్లో రష్యా కేంద్రంగా నడిచే 83 ఫేస్ బుక్ అకౌంట్లు, 2 పేజీలు, 29 గ్రూపులు, 5 ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను తొలగించినట్టు ఫేస్ బుక్ తెలిపింది.

మొత్తంగా దేశీయ కేంద్రీకృత అనాధికార యాక్టివిటీ ఉన్న హోండరస్ ప్రాంతంలో నిర్వహించే 181 అకౌంట్లు, 1,488 ఫేస్‌బుక్ పేజీలను తొలగించినట్టు ఫేస్‌బుక్ పేర్కొంది. కాగా ఈ ఏరివేత కార్యక్రమం ఇతర దేశాలకు కూడా విస్తరించే అవకాశంపై ఫేస్‌బుక్ ఇంకా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. అయితే త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సీక్రెట్ డేటింగ్ సర్వీసులు

సీక్రెట్ డేటింగ్ సర్వీసులు

ఇదిలా ఉంటే టిండర్‌ విజయం ఇచ్చిన ఊపుతో ఫేస్‌బుక్ తన ప్లాట్‌ఫామ్‌పై సీక్రెట్ డేటింగ్ సర్వీసులు ప్రారంభించింది. సీక్రెట్ క్రష్ పేరుతో ఈ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ సేవలు కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలోనే ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే టిండర్‌లో డేటింగ్ సర్వీసులు పొందాలంటే 30 డాలర్లు (దాదాపు రూ.2,000) చెల్లించాలి.

సింగపూర్‌లో అందుబాటులోకి

సింగపూర్‌లో అందుబాటులోకి

ఫేస్‌బుక్ డేటింగ్ సేవలు మే 1 నుంచి సింగపూర్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఫేస్‌బుక్ డేటింగ్ సర్వీసుల్లో యూజర్లు వారి కమ్యూనిటీలు, గ్రూప్స్, ఫ్రెండ్స్‌లో భాగస్వామి వెత్తుకోవచ్చు. మీ అభిప్రాయాలకు మ్యాచ్ అయ్యేవారితో చాట్ చేయవచ్చు. కలవొచ్చు. త్వరలోనే ఈ సేవలు భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫేస్‌బుక్‌లో కొత్త అప్‌డేట్ రూపంలో డేటింగ్ అనే ప్రత్యేకమైన సెక్షన్ ఉంటుంది. ఈ సేవలు మీ ప్రాంతంలో అందుబాటులోకి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ఓకే చేస్తే సరిపోతుంది. లేదంటే మీ ప్రొఫైల్‌లో హార్ట్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేసి ఈ సేవలు పొందొచ్చు. ఇక్కడ మీరు ప్రత్యేకమైన డేటింగ్ ప్రొఫైల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌కు ఎవరికీ కనిపించదు. ఇందులో సీక్రెట్ క్రష్ అనే ఫీచర్ ఉంటుంది. ఇందులో మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో నుంచి నచ్చిన 9 మందిని యాడ్ చేసుకోవచ్చు. మీలాగే అవతలి వారు కూడా 9 మందిని సీక్రెట్ క్రష్‌లను యాడ్ చేసుకునే అవకాశముంటుంది.

Best Mobiles in India

English summary
Facebook removes thousands of fake pages, accounts

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X