ఫేస్‌బుక్ అక్కడ డేటా సెంటర్‌ని నెలకొల్పడానికి కారణం

Posted By: Super

ఫేస్‌బుక్ అక్కడ డేటా సెంటర్‌ని నెలకొల్పడానికి కారణం

ఫేస్‌బుక్ అనతి కాలంలో ఎక్కువ మంది యూజర్స్‌ని సంపాదించుకున్న ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్. ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్ జనాభాకి సేవలను అందిస్తున్న వెబ్ సైట్. ఆసియాలో ఫేస్‌బుక్ సేవలను విస్తరించుకునేందుకు గాను కొత్తగా తైవాన్‌లో డేటా సెంటర్‌ని ప్రారంభించనుంది. ఫేస్‌బుక్ ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించకపోయినప్పటికీ, సిఈఎన్‌ఎస్ అనే పత్రిక ప్రచురించిన సమాచారం ప్రకారం ఫేస్‌బుక్ డేటా సెంటర్ స్దలం మొత్తం 720,000 చదరపు అడుగులుగా ఉండనుందని సమాచారం.

720,000 చదరపు అడుగులు అంటే సుమారు 180 బాస్కెట్ బాల్ కొర్టులతో సమానం. ప్రస్తుతం ఫేస్‌బుక్ డేటా సెంటర్లు అమెరికా, యూరప్‌లలో కలిగి ఉంది. స్వీడెన్‌లో కూడా డేటా సెంటర్‌ని స్దాపించనున్నట్లు తెలిపినప్పటికీ, దీనిపై సరైన స్పష్టతను మాత్రం తెలియజేయలేదు. ఇత తైవాన్‌లో కొత్తగా డేటా సెంటర్‌ని గనుక ప్రారంభించినట్లైతే, ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్ మూడు రీజియన్ల(అమెరికా, యూరప్, ఆసియా)లలో తన కంపెనీలను స్ధాపించినట్లు అవుతుంది.

తైవాన్‌లో ఫేస్‌బుక్ డేటా సెంటర్‌ని నెలకొల్పడం వల్ల అక్కడున్న తైవనీయులకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, వారి భాషలలో హార్డ్ వేర్, సర్వర్స్‌ని రూపొందించడం జరుగుతుందని తెలియజేశారు. దీని ద్వారా కొన్ని బిలియన్ డాలర్ల తైవనీజ్ బిజినెస్‌ని సంపాదించే భాగంలో ఇదోక వ్యూహాంగా తెలిపారు. పోయిన నెలలో సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ తన డేటా సెంటర్‌ని తైవాన్‌లో నెలకొల్పనున్నట్లు తెలిపిన వెంటనే, తైవనీస్ ప్రభుత్వ పెద్దలు ఫేస్‌బుక్ డేటా సెంటర్‌ని స్దాపించడానికి సిద్దమనగానే ఫేస్‌బుక్‌కి ఆహ్వానం పలికారు. దీనిని బట్టి చూస్తుంటే గూగుల్, ఫేస్‌బుక్ మద్య ఎంత పోటీ వాతావరణం ఉందో తెలిసిపోతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot