ఫేస్‌బుక్‌కు ఆపిల్ ఝలక్, ప్రశ్నార్థకంలో ఆపిల్ యూజర్ల డేటా !
ప్రపంచ టెక్ దిగ్గజ రారాజు అయిన అమెరికాకు చెందిన ఆపిల్ కంపెనీ అదే దేశానికి చెందిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు అనుకోని ఝలక్ ఇచ్చింది. ఈ ఏడాది ఆరంభంలోనే Facebook's enterprise certificateని రద్దు చేసింది. దీనికి ప్రధాన కారణం సోషల్ నెట్ వర్కింగ్ కంపెనీ ఫేస్ బుక్ ప్రవేశపెట్టిన మార్కెట్ రీసెర్చ్ యాప్. ఫేస్‌బుక్ తన రీసెర్చ్ యాప్ ద్వారా ఆపిల్ కంపెనీకి చెందిన యూజర్ల డేటా మొత్తాన్ని సేకరిస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆపిల్ కంపెనీ ఫేస్‌బుక్ రీసెర్చ్ యాప్ ను బ్యాన్ చేసింది.

ఫేస్ బుక్ రీసెర్చ్ యాప్ తో ఆపిల్ యూజర్ల స్మార్ట్ ఫోన్ ద్వారా వారి డేటాను సేకరించేందుకు ఫేస్ బుక్ ఆఫిల్ టెస్ట్ ఫ్లయిట్ ప్రొగ్రామ్ ను వినియోగిస్తోంది. మార్కెట్ రీసెర్చ్ ప్లాన్ యాప్ కారణంగా కొన్ని లక్షల మంది యూజర్ల డేటా బహిర్గతమైనట్టు ఆపిల్ గుర్తించింది. అయితే ఇప్పటివరకూ ఎంతమంది ఆపిల్ యూజర్లకు ఎఫెక్ట్ అయిందో, ఎంత డేటాను ఫేస్ బుక్ సేకరించిందో మొత్తం వివరాలు వెలుగులోకి వచ్చాయి.

1లక్ష 87వేల మంది యూజర్ల డేటా
Richard Blumenthal's office సెనేటర్ కు ఫేస్ బుక్ పంపించిన లేఖ ప్రకారం.. గ్లోబల్ వైడ్ గా Facebook లక్షా 87వేల మంది యూజర్ల డేటాను సేకరించినట్టు గుర్తించింది. ఈ డేటా అంతా ఫేస్ బుక్ రీసెర్చ్ యాప్ ద్వారా సేకరించినట్టు రిపోర్టు వెల్లడించింది. ఈ డేటాలో 31వేల మంది యూజర్లు అమెరికాకు చెందినవారు ఉండగా, వారిలో 4వేల 300మంది యువకులే ఉన్నారు. మిగిలిన డేటాలో యూజర్ల వ్యక్తిగత సమాచారం 1.56 లక్షల వరకు ఉంటే వీరంతా ఇండియాకు చెందినవారిగా గుర్తించింది.

2019లోనే రీసెర్చ్ యాప్ బ్లాక్
ఈ రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది ఆరంభంలో బ్లాక్ చేసిన Facebook Research app సహాయంతో ఫేస్ బుక్ కంపెనీ VPN బేసిడ్ యాప్ ద్వారా ఆపిల్ యూజర్ల ఫోన్లను రూటింగ్ యాక్సస్ చేస్తున్నట్టు తేలింది. ఫేస్ బుక్ కంపెనీ Project Atlast పేరుతో మరో మూడు బీటా టెస్టింగ్ సర్వీసులు Applause, betabound, uTest ను వాడుతోంది. ఈ సర్వీసుల ద్వారా యూజర్ల డేటాను సేకరించేందుకు వీటిని వినియోగిస్తోంది. ఈ విషయం గుర్తించిన వెంటనే ఆపిల్ కంపెనీ.. డెవలపర్ పాలసీ ఉల్లంఘన కింద.. ఫేస్ బుక్ ఎంటర్ ప్రైజ్ సర్టిఫికేట్ తోపాటు iOS స్టోర్ లోని గూగుల్ ఇంటర్నల్ యాప్స్ ను కూడా ఆపిల్ షట్ డౌన్ చేసింది.

2016లో రీసెర్చ్ యాప్ లాంచ్
2016లో ఫేస్ బుక్ రీసెర్చ్ యాప్ ను కంపెనీ లాంచ్ చేసింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఫేస్ బుక్.. 1లక్ష 87వేల యూజర్ల డేటాను సేకరించినట్టు నివేదిక వెల్లడించింది. ఒక్క అమెరికాలోనే రీసెర్చ్ డేటా 31వేల మంది యూజర్లు ఉన్నారు. వీరిలో 4వేల 300 మంది యూజర్లు 13 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే కావడం గమనార్హం. మరోవైపు ఫేస్ బుక్ వివాదాస్పద యాప్ ‘ఫేస్ బుక్ రీసెర్చ్ యాప్' ను ఇఫ్పటివరకూ ఎంతమంది డౌన్ లోడ్ చేసుకున్నారో కచ్చితమైన సంఖ్య తెలియదని తెలిపింది.

స్టడీ యాప్
ఏప్రిల్ 19, 2017లో ఫేస్ బుక్ రీసెర్చ్ యాప్ కు సంబంధించి ఎండ్ యూజర్ ప్రొఫైల్ ను క్రియేట్ చేసినట్టు ఆపిల్ గుర్తించింది. ఇదిలా ఉంటే ఇటీవల ఫేస్ బుక్ కొత్త మార్కెట్ రీసెర్చ్ యాప్ ను ‘స్టడీ యాప్' పేరుతో లాంచ్ చేసింది. ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ను 18ఏళ్లు వయస్సు లేదా ఆపై బడిన యూజర్ల వాడాలనుకుంటే వారికి నిబంధనలు కఠినతరం చేసినట్టు నివేదిక వెల్లడించింది.


Click it and Unblock the Notifications