విడాకులకు కారణమవుతున్న ఫేస్‌బుక్‌!

Posted By: Prashanth

విడాకులకు కారణమవుతున్న ఫేస్‌బుక్‌!

 

లండన్‌: ఇటీవల ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బెర్గ్‌ పెళ్ళిచేసుకొని తన హోదాను మార్పుకోగా, ఆయన ప్రారంభించిన వెబ్‌సైట్‌ మాత్రం విడాకులకు కారణమవుతోందని యూకేలో తాజాగా జరిపిన సర్వే వెల్లడించింది. భార్యా భర్తలు విడిపోవటానికి, విడాకులు పొందినవారు పరస్పరం ఒకరి పై మరొకరు వ్యాఖ్యానాలు చేసుకోవటానికి సామాజిక వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌ వేదికగా మారుతోందని ఈ పరిశోధన నిగ్గు తేల్చింది. కుటుంబ అంతఃకలహాల మూలంగా జంటలు ఒకరి ప్రవర్తనపై మరొకరు వెబ్‌సైట్‌ మాధ్యమంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారని సర్వే తెలిపింది.

గత సంవత్సరం దేశంలో విడాకులు తీసుకున్న 33 శాతం కేసుల్లో ఫేస్‌బుక్‌లో ఆయా జంటలు పోస్ట్‌చేసిన వ్యాఖ్యానాలు, చిత్రాలు తోడ్పడ్డాయని, విడాకులు కోరుకున్న 5000 పిటిషన్‌లపై అధ్యయనం చేసిన యూకే లా సంస్థ ‘డైవోర్స్‌ ఆన్‌లైన్‌’ గుర్తించింది. కాగా 2009లో నమోదైన ఈ కేసులతో పోలిస్తే ప్రస్తు త కేసులు 20 శాతం ఎక్కువ అని తెలిపింది. విడాకులు పొందాలనే తలంపు ఉన్నవారు, తమ భర్త లేదా భార్య ప్రవర్తనపై వాఖ్యానాలు, రెస్టారెంట్లలో వారి అసహజ ప్రవర్తనపై తీసిన ఫొటోలను ఫేస్‌బుక్‌లోకి పోస్ట్‌చేసి వాటిని విడాకుల మంజూరుకు సాక్ష్యాలుగా ఉపయోగించటం పెరిగిందని సర్వే స్పష్టం చేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot