ఒక్క బగ్‌తో ఫేస్‌బుక్ నుంచి 10 లక్షలు..

Written By:

బిటెక్ చదివే కుర్రాడు. నిండా ఇరవై యేళ్లు కూడా దాటలేదు. ఏకంగా ఫేస్‌బుక్ యాజమాన్యం చేతనే మెప్పు పొందాడు. ఏకంగా 10 లక్షల నజరానా అందుకున్నాడు. అయితే అతనేం తలపండిన సాంకేతిక నిపుణుడు కూడా కాదు. ఇంకా చెప్పాలంటే ప్రఖ్యాత సంస్థలో జాబు కూడా లేదు. అయితే తనుకున్నది కేవలం ఆసక్తి మాత్రమే. ఆ ఆసక్తితో సాఫ్ట్‌వేర్ బగ్‌ని పట్టేశాడంతే. ఆ బగ్‌ను చూసిన ఫేస్‌బుక్ యాజమాన్యం మనోడికి భారీగానే నజరానా ప్రకటించింది.

Read more: అమెరికాలో అత్యంత చెత్త జీతాలు ఇచ్చే రాష్ట్రాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ లాగిన్ సిస్టమ్‌లో నెలకొన్న ఓ బగ్‌ను కనుగొన్నందుకు

ఫేస్‌బుక్ లాగిన్ సిస్టమ్‌లో నెలకొన్న ఓ బగ్‌ను కనుగొన్నందుకు బెంగుళూరుకు చెందిన టెక్కీ ఆనంద్ ప్రకాష్‌కు ఫేస్‌బుక్ సంస్ధ రూ. 10 లక్షల బహుమతిని ప్రకటించింది. ఈ బగ్ ద్వారా హ్యాకర్లు ఫేస్‌ బుక్ యూజర్ల మెసేజ్‌లు, ఫోటోలు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని హ్యాక్ చేయగలుతారని ప్రకాష్ పేర్కొన్నాడు.

తాను కనుగొన్న బగ్ వివరాలను

ఫేస్‌బుక్ లాగిన్ సిస్టమ్‌లో తాను కనుగొన్న బగ్ వివరాలను ప్రకాష్ తన బ్లాగ్‌ (http://www.anandpraka.sh/)లో పోస్ట్ చేశాడు. తాను కనుగొన్న బగ్ రిపోర్ట్‌ను ప్రకాష్ ఫిబ్రవరి 22న ఫేస్‌‌బుక్ సెక్యూరిటీ టీమ్‌కు పంపగా, మార్చి 2వ తేదీన రివార్డుకు సంబంధించిన మెయిల్‌ను ఫేస్‌బుక్ పంపింది.

ఓ యూజర్ తన ఫేస్‌బుక్ ఖాతా పాస్‌వర్డ్‌ను

తన బ్లాగ్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం ఓ యూజర్ తన ఫేస్‌బుక్ ఖాతా పాస్‌వర్డ్‌ను మరిచిపోయినప్పుడు దాన్ని రీసెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. తన ఫోన్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీకి ఆరు అంకెల కోడ్‌ను రిక్వెస్ట్ చేసి, దాన్ని పేజీలో ఎంటర్ చేయడం ద్వారా కొత్త పాస్‌వర్డ్‌ను నమోదు చేసుకోవచ్చు.

ఆరంకెల కోడ్‌ను ఎంటర్ చేస్తుంటే 10 నుంచి 12 సార్ల తర్వాత

ఇది ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే, ఫేస్‌బుక్ ఖాతాలో పాస్ వర్డ్ మరచిపోయామని వెల్లడించి, ఆపై తప్పుడు ఆరంకెల కోడ్‌ను ఎంటర్ చేస్తుంటే 10 నుంచి 12 సార్ల తర్వాత ఫేస్‌బుక్ ఖాతా బ్లాక్ అవుతుంది.

వేర్వేరు మిర్రర్ సైట్ల ద్వారా ఫేస్‌బుక్ ఖాతాలోకి లాగిన్

ఇక్కడే ప్రకాష్‌కు ఒక ఆలోచన తట్టింది. నిజానికి వేర్వేరు మిర్రర్ సైట్ల ద్వారా ఫేస్‌బుక్ ఖాతాలోకి లాగిన్ అవ్వొచ్చు. ఉదాహరణకు 'బీటా. ఫేస్‌బుక్', 'టచ్. ఫేస్‌బుక్', 'ఎంబేసిక్స్. బీటా. ఫేస్‌బుక్', 'మొబైల్. ఫేస్‌బుక్' వంటి సైట్ల నుంచి కూడా ఫేస్‌బుక్‌కు లాగిన్ అయి యూజర్ తాను పోస్టులు చూడొచ్చు లేదా డిలీట్ చేయొచ్చు లేదంటే మార్చవచ్చు.

బ్లాక్ అయిన ఖాతాను విజయవంతంగా ఓపెన్ తెరిచి

ఇలా డెస్కటాప్ ద్వారా ఫేస్‌బుక్‌లో ఖాతాలో బ్లాక్ అయినప్పటికీ ఈ మిర్రర్ వెబ్‌సైట్ల ద్వారా లాగిన్ అవ్వొచ్చని ప్రకాష్ కనుగొన్నాడు. పాస్‌వర్డ్‌ను మరిచిపోయినా, బ్లాక్ అయిన ఖాతాను విజయవంతంగా ఓపెన్ తెరిచి కొత్త పాస్‌వర్డ్‌ను ప్రకాష్ రీసెట్ చేసుకున్నాడు.

ఈ బగ్ గురించి వెల్లడించిన తర్వాతనే ఫేస్‌బుక్ అతడికి

ఇదే ఫేస్‌బుక్ లాగిన్ సిస్టమ్‌లో ప్రకాష్ కొనుగొన్న బగ్. ఈ బగ్ గురించి వెల్లడించిన తర్వాతనే ఫేస్‌బుక్ అతడికి $15,000 (సుమారు రూ. 10 లక్షల) బహుమతిని ప్రకటించింది. అంతేకాదు ప్రకాష్ కనుగొన్న ఈ బగ్‌ను తొలగించేందుకు చర్యలు కూడా తీసుకున్నామని ప్రకటనలో పేర్కొంది.

2015 సంవత్సరంలో 210 మంది రీసెర్చర్లు ఫేస్‌బుక్‌లోని

కాగా, 2015 సంవత్సరంలో 210 మంది రీసెర్చర్లు ఫేస్‌బుక్‌లోని వందలాది బగ్స్ కనుగొని వాటిని వెల్లడించినందుకు గాను ఫేస్‌బుక్ 9.36 లక్షల డాలర్లను వారికి బహుమతిగా అందించింది. రాజస్థాన్‌లోని భద్ర పట్టణంలో జన్మించిన ప్రకాష్ తమిళనాడులోని వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కంప్యూటర్ సైన్సు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

ఒక్క ఫేస్‌బుక్‌లోనే 80 బగ్స్ కనుగొన్నందుకు గాను

ఒక్క ఫేస్‌బుక్‌లోనే 80 బగ్స్ కనుగొన్నందుకు గాను ఇప్పటి వరకు రూ. 1 కోటి రూపాయలు బహుమతిగా పొందాడు. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో అత్యధికంగా బగ్స్ కనుగొన్నందుకు గాను 2015 సంవత్సరంలో ప్రపంచంలోనే నెంబర్.4 ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

గూగుల్, ట్విట్టర్, అడోబ్, రెడ్ హాట్,

గూగుల్, ట్విట్టర్, అడోబ్, రెడ్ హాట్, సౌండ్ క్లౌడ్, నోకియా, పేపాల్, ఈబే లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా ప్రకాష్ బగ్స్‌ను కనుగొన్నాడు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోర్స్ : Anand Twitter

English summary
Here Write Facebook Rewarded This Bengaluru Techie Rs 10 Lakh For Finding A Bug
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot