త్వరలో అన్ని దేశాలకు ఫేస్‌బుక్ ఫేసియల్ రిగగ్నైజ్ టూల్

Posted By: Staff

త్వరలో అన్ని దేశాలకు ఫేస్‌బుక్ ఫేసియల్ రిగగ్నైజ్ టూల్

రోజు, రోజుకీ పోటీ పెరుగుతున్నటువంటి పోటీ ప్రపంచంలో పోటీ వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఉండడానికి ఎక్కువ మంది యూజర్స్ కలిగినటువంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కొన్ని కొత్త ఫీచర్స్‌ని ప్రారంభించింది. సినెట్ అందించిన కధనం ప్రకారం ముఖ్యంగా మనం తెలుసుకోదగ్గవి టాగ్ సలహాలు, ఫేసియల్ రిగగ్నైజ్ టూల్, ఆటోమేట్ ఫోటో టాగింగ్ మొదలగునవి. ఐటి సెక్యూరిటీ సంస్ద అయినటువంటి సోఫిస్ అందించిన సమాచారం ప్రకారం ఫేసియల్ రిగగ్నైజ్ టూల్ అనేది ప్రస్తుతం అమెరికాలో అందుబాటులో ఉంది. రాబోయే కాలంలో ఈ టెక్నాలజీని మరిన్ని దేశాలకు విస్తరించే యోచనలో ఉందన్నారు.

ఈ సందర్బంలో ఫేస్‌బుక్ ప్రతినిధి మాట్లాడుతూ ఫేసియల్ రిగగ్నైజ్ టూల్‌ని మేము డిసెంబర్‌లో ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్‌లో ఉంది. దీనికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ని తీసుకోని ఏమైనా పోరపాట్లు ఉంటే సరిదిద్ది త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ ఫీచర్‌ని అందుబాటులోకి వచ్చిన తర్వాత డీఫాల్ట్‌గా మీ ఫేస్‌బుక్‌లో ఉంటుంది. ఒకవేళ ఇది మీకు గనుక ఆసక్తిగా లేకపోతే ఎవరైతే ఫేస్‌బుక్ యూజర్స్ ఉన్నారో వారంతా ఫేస్‌బుక్ ఎకౌంట్ ద్వారా వారియొక్క ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్శి డిసేబుల్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot