2 లక్షల ఫేస్‌బుక్ ఎకౌంట్లు హాక్: బూతు బొమ్మలు

Posted By: Super

2 లక్షల ఫేస్‌బుక్ ఎకౌంట్లు హాక్: బూతు బొమ్మలు

బెంగళూరు: బెంగుళూరుకి చెందిన రెండు లక్షల మంది ఫేస్‌బుక్ ఎకౌంట్స్ కొట్టివేయబడి వారికి సంబంధించిన వెబ్ లింక్స్‌లో బూతు బొమ్మలతో కూడినటువంటి ఇమేజి లను వారియొక్క ప్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు పంపడం జరిగిందని సమాచారం. వివరాల్లోకి వెళితే నవంబర్ 13 ఆదివారం అర్దరాత్రి సుమారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్ ఎకౌంట్లలలో ఆరు లక్షల మందివి ఎకౌంట్లు కొట్టివేయగా, ఈ ఆరు లక్షలలో బెంగుళూరుకి చెందిన ఫేస్‌బుక్ యూజర్లు 2 లక్షల మంది ఉండడం విశేషం.

ఈ విషయంపై స్పందించిన ఫేస్‌బుక్ యాజమాన్యం స్పామ్ మొయిల్స్ ద్వారా హాకర్స్ ఈ పని చేయడం జరిగిందని తెలిపింది. దీనివల్ల కొంత వరకు నష్టం వాటిల్లిన మాట వాస్తవమేనని అన్నారు. రాబోయే కాలంలో ఫేస్‌బుక్ యూజర్స్‌ని స్పామ్‌తో పాటు, కొన్ని అనధికార కంటెంట్ నుండి కాపాడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ పనికి పాల్పడిన వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది. హాకర్స్ పంపినటువంటి ఇమేజిలలో ఎక్కవ భాగం ఇమేజిలు బూతు చిత్రాలను కలిగి ఉన్నాయని అన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఎక్కువ మంది ఫేస్‌బుక్ యూజర్స్ మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot