ఫేస్‌బుక్‌లో లీకవుతున్న వ్యక్తిగత వివరాలు, సిమాంటెక్‌ వెల్లడి

Posted By: Staff

ఫేస్‌బుక్‌లో లీకవుతున్న వ్యక్తిగత వివరాలు, సిమాంటెక్‌ వెల్లడి

మీకు ఫేస్‌బుక్‌లో ఖాతా ఉందా.. అయితే కొంచెం జాగ్రత్త. వందల వేలకొద్దీ ఫేస్‌బుక్‌ వినియోగదార్ల ఖాతా వివరాలన్నీ మూడో వర్గానికి(థర్డ్‌ పార్టీ) ముఖ్యంగా వ్యాపార ప్రకటనల వారికి లీకవుతున్నట్లు డేటా సెక్యూరిటీ సొల్యూషన్ల సంస్థ సిమాంటెక్‌ వెల్లడించింది. కొన్నేళ్లుగా ఇలా జరుగుతోందని ఆ సంస్థ తన అధికారిక బ్లాగులో పేర్కొంది. ఫేస్‌బుక్‌ ఖాతాదారుల 'యాక్సెస్‌ టోకెన్లు' లీక్‌ కావడంతో ప్రకటనదార్లు ఆయా ఖాతాల్లోని ప్రొఫైల్స్‌, ఫొటోలు, చాటింగ్‌ వివరాలను వారు పొందడమే కాకుండా ఆయా ఖాతాల్లోకి సందేశాలను పంపడమూ చేస్తున్నారని వివరించింది. యాక్సెస్‌ టోకెన్లనేవి అదనంగా ఇచ్చే తాళం చెవుల లాంటివి.

వీటి ద్వారా ఖాతాదారు బదులు వేరెవరైనా ఖాతాను యాక్సెస్‌ చేసుకోవచ్చు. కేవలం గత నెలలోనే 1,00,000 అప్లికేషన్లు లీకేజీ పాలయ్యాయని సిమాంటెక్‌ అంచనా. కొన్నేళ్లుగా చూస్తే లక్షల కొద్దీ టోకెన్లు వారిబారినపడి ఉండొచ్చని ఆ సంస్థ తన బ్లాగులో తెలిపింది. ఫేస్‌బుక్‌ సంస్థకు ఈ విషయాన్ని తెలిపామనీ.. లీకేజీ గురించి ఆ సంస్థ సైతం అంగీకరించిందని.. అందుకు తగ్గ చర్యలు తీసుకోనున్నట్లు కూడా తమకు వివరించిందని అందులో పేర్కొంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting