ఇక మీదట ఫేస్‌బుక్లో డీల్స్ సర్వీస్ ఉండబోదు..

Posted By: Staff

ఇక మీదట ఫేస్‌బుక్లో డీల్స్ సర్వీస్ ఉండబోదు..

ఫేస్‌బుక్లో ఏప్రిల్ 5వ తారీఖున ఎంతో అట్టహాసంగా ఫేస్‌బుక్ డీల్స్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐతే సడన్‌గా ఫేస్‌బుక్ డీల్స్‌‌ని మూసివేస్తున్నట్లు అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ సందర్బంలో అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఫేస్‌బుక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన డీల్స్ సర్వీస్‌ని నాలుగు నెలలు నుండి టెస్టు చేయడం జరిగింది. మేము ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఫేస్‌బుక్ డీల్స్ సర్వీస్‌ని రానున్న రోజుల్లో నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

అందుకు గల కారణాలను తెలియజేస్తూ సాధారణంగా ఫేస్‌బుక్ లోకల్ బిజినెస్‌లో నడపాలంటే అందుకు చాలా శక్తి సామర్ద్యాలు అవసరం. మేము నిర్వహించిన ఈ నాలుగు నెలల్లో మేము టెస్టింగ్ దశలో ఉంచి చాలా చిన్న చిన్న పోరపాట్లను తెలుసుకోవడం జరిగింది. అలాంటి అన్ని రకాల పోరపాట్లను సరిదిద్ది త్వరలో లోకల్ బిజినెస్ బెస్ట్‌గా అందివ్వాలని ఆలోచనలో ఉన్నామని తెలిపారు.

ఇక ఫేస్‌బుక్ డీల్స్ సర్వీస్‌‍ని విడుదల చేసిన తర్వాత గ్రూపాన్, లివింగ్ సోషల్ డీల్ వెబ్‌సైట్స్ నుండి అనూహ్యామైన స్పందన రావడం జరిగింది. ఐతే ఫేస్‌బుక్ డీల్స్ కూడా వేరే వెబ్ సైట్స్ మాదిరే డీల్స్‌ని సెట్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా గతంలో వార్నర్ బ్రదర్స్‌కు సంబంధించినటువంటి కొన్ని సినిమాలు ప్రఖ్యాత సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లో ప్రదర్శించడానికి ఓకె తెలిపిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌ ఎకౌంట్స్ ఉన్నటువంటి వారందరూ ఈసదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇది వార్నర్ బ్రదర్స్ స్టూడియోకి డబ్బులు వచ్చే మంచి పని అని దీనిని ప్రోత్సహించడం జరిగిందన్నారు.

ఈ ప్రక్రియ గనుక సక్సెస్‌పుల్ అయినట్లైతే దీనిని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా విస్తరిస్తామని అన్నారు. ఫేస్‌బుక్‌లో ఎవరికైతే 30 ఫేస్‌బుక్ క్రెడిట్స్ ఉన్నవారికి సినిమాకి గాను మూడు డాలర్స్ వసూలు చేయడం జరుగుతుందని అన్నారు. సినిమాని 48 గంటల పాటు చూడడానికి వీలుగా అవకాశం కల్పిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో మొట్టమొదటగా పెట్టినటువంటి సినిమా 2008వ సంవత్సరంలో విడుదలైనటువంటి బ్లాక్ బాస్టర్ సినిమా బ్యాట్ మ్యాన్: ద డార్క్ నైట్. తర్వాత వరుసగా సినిమాలు ఫేస్‌బుక్‌లో పెట్టడం జరుగుతుందని బిబిసికి ఇచ్చిన ఇంటర్యూలో వార్నర్ బ్రదర్స్ తెలియజేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot