Facebook సంస్ధ యొక్క కొత్త స్మార్ట్ ప్రాజెక్టుల మీద ఓ లుక్ వేయండి...

|

ప్రస్తుత సమయంలో చాలా మంది ప్రతిరోజూ ధరించడానికి ఇష్టపడే గాడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ ఒకటి. అయితే ఈ స్మార్ట్‌వాచ్‌ను ప్రముఖ ఫేస్‌బుక్ సంస్థ విడుదల చేయనున్నది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేయడానికి కంపెనీ పనిచేస్తుందని చెబుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఈ స్మార్ట్ వాచ్ ఆండ్రాయిడ్ చేత శక్తినిపొందుతూ ఉంటుంది. అలాగే సంస్థ యొక్క స్వంత ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ను ఉపయోగిస్తుందా లేదా గూగుల్ వేర్ OSను ఉపయోగిస్తుందో అన్న విషయం ప్రస్తుతానికి తెలియదు.

ఫేస్‌బుక్ స్మార్ట్ వాచ్

ఫేస్‌బుక్ స్మార్ట్ వాచ్ ఫిట్నెస్ మరియు ఆరోగ్య లక్షణాలతో లోడ్ అవుతుందని భావిస్తున్నారు. ఏదేమైనా ఫేస్బుక్ స్మార్ట్ వాచ్ ద్వారా నేరుగా ఇతర వ్యక్తులకు మెసేజ్ లను పంపించగలుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఎందుకంటే ఇతర స్మార్ట్ వాచ్‌లు ఏవీ వినియోగదారులకు ఇటువంటి ఫీచర్స్ ఇవ్వడం లేదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫేస్‌బుక్ త్వరలో ప్రారంభించబోయే స్మార్ట్ ఉత్పత్తులు

ఫేస్‌బుక్ త్వరలో ప్రారంభించబోయే స్మార్ట్ ఉత్పత్తులు

కొత్త కొత్త స్మార్ట్ ఉత్పత్తులను క్రమం తప్పకుండా నిర్మించడానికి మరియు ప్రారంభించడానికి ఫేస్‌బుక్ సంస్థ పరిశోధన మరియు R&D విభాగాలలో భారీగా పెట్టుబడులను పెట్టే ఆలోచనలో ఉంది. ఫేస్‌బుక్ సంస్థ అధిక భాగం హార్డ్‌వేర్ విభాగంలోని ‘ఓకులస్' వద్ద పెట్టుబడులు పెడుతోంది. ఓకులస్ అనేది వర్చువల్ రియాలిటీ (IR) ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ. ఇది VR హెడ్‌సెట్‌లు మరియు వాటి యొక్క అనుబంధ ఉత్పత్తులను అబివృద్ది చేస్తుంది. వీడియో కాలింగ్ ను అనుమతించే డివైస్ లను సృష్టించే ‘పోర్టల్' కూడా ఫేస్‌బుక్‌లో ఉంది. స్మార్ట్ వాచ్, VR హెడ్‌సెట్‌లు, వీడియో కాలింగ్ డివైస్ లతో పాటు ఫేస్‌బుక్ ‘ప్రాజెక్ట్ అరియా' పై పనిచేస్తుందని చెబుతున్నారు.

ఫేస్‌బుక్ స్మార్ట్ గ్లాసెస్ కొత్త ప్రాజెక్ట్

ఫేస్‌బుక్ స్మార్ట్ గ్లాసెస్ కొత్త ప్రాజెక్ట్

స్మార్ట్ గ్లాసెస్ లను సృష్టించడానికి ఫేస్‌బుక్ సంస్థ మరింత కృషి చేస్తున్నది. వినియోగదారులకు మెరుగైన మరియు స్టైలిష్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనుభవాన్ని అందించడానికి రే-బాన్ సంస్థ యొక్క భాగస్వామ్యం సాయంతో ఫేస్‌బుక్ సంస్థ తన యొక్క కొత్త ప్రాజెక్ట్ ను పూర్తి చేసే పనిలో ఉంది. సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా ఫేస్‌బుక్ సంస్థ ‘క్లబ్‌హౌస్' మాదిరిగానే ఒక అప్లికేషన్‌ను రూపొందించడానికి మరియు ప్రారంభించడానికి కృషి చేస్తోంది.

ఫేస్‌బుక్ క్లబ్‌హౌస్ అభివృద్ధి

ఫేస్‌బుక్ క్లబ్‌హౌస్ అభివృద్ధి

ఫేస్‌బుక్ సంస్థ యొక్క కొత్త యాప్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. అయితే సంస్థ దీన్ని త్వరలోనే ప్రారంభించనుంది అని సమాచారం. క్లబ్‌హౌస్ అనేది ఒక ప్రత్యేకమైన యాప్. ఇది వినియోగదారులను మరొకరు ఆహ్వానించినప్పుడు మాత్రమే చేరడానికి అనుమతిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో లేదు. అలాగే iOS వినియోగదారులు కూడా వారు ఆహ్వానించబడే వరకు నేరుగా App Store నుండి డౌన్‌లోడ్ చేయలేరు.

Best Mobiles in India

English summary
Facebook Smartwatch, Smart Glass, Clubhouse App New Projects Facts

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X