వరంగల్ నిట్ విద్యార్దికి ఫేస్‌బుక్ రూ 45 లక్షల ఆఫర్

Posted By: Super

వరంగల్ నిట్ విద్యార్దికి ఫేస్‌బుక్ రూ 45 లక్షల ఆఫర్

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్‌లో ఈరోజు ఓ ఆశ్చర్యకరమైన రోజు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుట్టి ఈరోజుకి 51 సంవత్సరాలు పూర్తి అయింది. సాధారణంగా ప్రతి సంవత్సరం ఆగస్టు నుండి మార్చి వరకు ఇక్కడ క్యాంపస్ ఇంటర్యూలలో వేరు వేరు కంపెనీలు వచ్చి విద్యార్దులను తీసుకొని వెల్లడం జరుగుతుంటుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15 నుండి క్యాంపస్ ఇంటర్యూలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం 21సంవత్సరాలు వయసు కలిగి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్‌కి అత్యధికంగా, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చరిత్రలోనే కనివిని జీతాన్నిసంవత్సరానికి 45లక్షలు ఫేస్‌బుక్ ఆఫర్ చేసింది. దీంతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్దులు మొత్తం ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఈ విషయాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అపీసియల్స్ కన్పమ్ చేశారు. అది మాత్రమే కాకుండా ఈ సంవత్సరం మార్చిలో అతని చదువు పూర్తి అవ్వగానే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఆఫర్ చేసిన జాబ్‌లో జాయిన్ అవ్వడం జరుగుతుందని తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ చరిత్రలోనే దీనిని ఓ బెంచి మార్క్‌గా అబివర్ణించారు. ఇప్పటి వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అత్యధిక జీతం సంవత్సరానికి 20 లక్షలుగా నమోదు కావడం జరిగింది. 2011-2012 సంవత్సరానికి గాను ముగ్గరు విద్యార్దులు 20 లక్షలు జీతాన్ని అందుకోవడం జరిగిందని అన్నారు.

సాధారణంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్‌లో ఫ్రెషర్స్‌కి రూ 5 లక్షలు నుండి రూ 12 లక్షలు వరకు సంవత్సరానికి ఉంటుందని తెలిపారు. ఆగస్టు 15 నుండి జరుగుతున్న క్యాంపస్ ఇంటర్యూలలో ఇప్పటి వరకు సుమారుగా 30 మంది విద్యార్దులు కంప్యూటర్ సైన్సు విభాగం నుండి సెలెక్ట్ అవ్వడం జరిగిందని తెలిపారు. మొదటి రౌండ్‌లో ఎనిమిది కంపెనీలు క్యాంపస్‌కి రావడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం కొత్తగా కొన్ని కంపెనీలు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ నియామకం చేసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు.

క్యాంపస్‌లో విద్యార్దులను రిక్యూట్ చేసుకొవడం కోసం మైక్రోసాప్ట్, అమెజాన్, ఒరాకిల్, గూగుల్ లాంటి కంపెనీలు క్యూలో ఉన్నాయని అన్నారు. పోయిన సంవత్సరం 92శాతం మంది బీటెక్ విభాగంలో సెలెక్ట్ అవ్వగా, 50శాతం మంది విద్యార్దులు ఎమ్‌టెక్ విభాగం నుండి సెలెక్ట్ అవ్వడం జరిగిందని తెలియజేశారు. యావరేజిగా కంపెనీలు అందించే జీతం సంవత్సరానికి సుమారుగా రూ 6 లక్షలు నుండి రూ 7 లక్షలు వరకు ఉంటుందని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot