ఫేస్‌బుక్ కంపెనీ పేరు మారనున్నది!! ఇది ఎంతవరకు నిజం....

|

ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ మీడియా కంపెనీలలో ఒకటైన ఫేస్‌బుక్ త్వరలోనే రీబ్రాండింగ్ కార్యాచరణను చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ది వెర్జ్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం కంపెనీని ఇకపై Facebook అనే పేరుతో పిలవకపోవచ్చు అని సూచిస్తున్నాయి. అయితే ఈ కంపెనీ యొక్క కొత్త పేరు ఏమిటో అన్నది మాత్రం ఇప్పటికి ఎటువంటి సమాచారం లేదు. ఫేస్‌బుక్ "పుకార్లు లేదా ఊహాగానాలు" పై దృష్టి పెట్టదని అదే విధంగా వ్యాఖ్యానించడాన్ని ఖండించింది.

 

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ పేరు మార్చడం ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఇది సంస్థ యొక్క చాలా మంది అభిమానులను బాధపెట్టవచ్చు. కానీ ఇది చాలా మందికి అర్ధం అవుతుంది. గత కొన్నేళ్లుగా ఈ సోషల్ మీడియా ఉనికి పెరగడంతో ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల పరిశీలనలో ఉంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) ప్రభుత్వం ఫేస్‌బుక్ ఎలా పనిచేస్తుందనే దానిపై అసంతృప్తిగా ఉంది.

Facebook హోల్డింగ్ కంపెనీ

Facebook హోల్డింగ్ కంపెనీ

సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీలు తమ పేర్లను మార్చడం అపూర్వమైన విషయం ఏమి కాదు. ఉదాహరణకు గూగుల్ సంస్థ 'ఆల్ఫాబెట్ ఇంక్' అనే హోల్డింగ్ కంపెనీని సృష్టించింది. తద్వారా దాని వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. Facebook యొక్క అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్ లో Instagram, WhatsApp, Oculus వంటి మరిన్నింటితో ఫేస్‌బుక్ హోల్డింగ్ కంపెనీ కూడా చేపట్టడానికి చాలా ఉంది. ఫేస్‌బుక్ మెటావర్స్‌ను సృష్టించే ప్లాన్ లను కలిగి ఉంది. ఇది వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఇది ప్రజలు ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) మరియు వర్చువల్ రియాలిటీ (VR) ఉత్పత్తుల సహాయంతో ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.

Facebook
 

Facebook సంస్థ యొక్క కొత్త పేరు వచ్చే వారం ప్రారంభంలో ప్రకటించబడవచ్చు అని వెర్జ్ నివేదిక జోడించింది. ఇది చాలా మంది కంపెనీ అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏదేమైనా ఇది కంపెనీ భవిష్యత్తుకు చాలా సానుకూలమైన విషయం కావచ్చు మరియు రాబోయే కొన్నేళ్లలో చేయాలనుకుంటున్న పనులను సులభంగా చేయడంలో కూడా సహాయపడుతుంది. ది వెర్జ్ నుండి వచ్చిన నివేదిక వాస్తవానికి సరైనదేనా మరియు ఫేస్‌బుక్ కొత్త పేరుతో వస్తోందా లేదా అని చూడటం చాలా ఆసక్తికరంగా ఉంది.

ఫేస్‌బుక్ స్మార్ట్ ఉత్పత్తులు

ఫేస్‌బుక్ స్మార్ట్ ఉత్పత్తులు

కొత్త కొత్త స్మార్ట్ ఉత్పత్తులను క్రమం తప్పకుండా నిర్మించడానికి మరియు ప్రారంభించడానికి ఫేస్‌బుక్ సంస్థ పరిశోధన మరియు R&D విభాగాలలో భారీగా పెట్టుబడులను పెట్టే ఆలోచనలో ఉంది. ఫేస్‌బుక్ సంస్థ అధిక భాగం హార్డ్‌వేర్ విభాగంలోని ‘ఓకులస్' వద్ద పెట్టుబడులు పెడుతోంది. ఓకులస్ అనేది వర్చువల్ రియాలిటీ (IR) ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ. ఇది VR హెడ్‌సెట్‌లు మరియు వాటి యొక్క అనుబంధ ఉత్పత్తులను అబివృద్ది చేస్తుంది. వీడియో కాలింగ్ ను అనుమతించే డివైస్ లను సృష్టించే ‘పోర్టల్' కూడా ఫేస్‌బుక్‌లో ఉంది. స్మార్ట్ వాచ్, VR హెడ్‌సెట్‌లు, వీడియో కాలింగ్ డివైస్ లతో పాటు ఫేస్‌బుక్ ‘ప్రాజెక్ట్ అరియా' పై పనిచేస్తుందని చెబుతున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Facebook Social Media Company Name is Changing

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X