ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ ఉందా.. ఐతే తస్మాత్ జాగ్రత్త..

Posted By: Super

ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ ఉందా.. ఐతే తస్మాత్ జాగ్రత్త..

లండన్: సోషల్ మీడియా రంగంలోకి ప్రవేశించిన అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న ఫేస్‌బుక్ ఇప్పడు విమర్శలను ఎదుర్కోంటుంది. ఫేస్‌బుక్ ఎదుర్కొంటున్న విమర్శలు ఏమిటని అనుకుంటున్నారా.. యూరప్ దేశాలలో ఫేస్‌బుక్ తనయొక్క యూజర్స్‌కి సంబంధించిన సమచారాన్ని ఎడ్వర్టైజర్స్‌కి అమ్ముతుందంటూ వార్తలు ఓ ప్రముఖ దినపత్రికలో కధనం ప్రచురితమైంది.

ఈ కధనంలో ఉన్న సమాచారం ప్రకారం పోలిటికల్ ఓపెనియన్స్, సెక్యువాలిటీ, రిజిలియస్ బిలిఫ్స్ లాంటి సమాచారాన్ని వేరే వాళ్లకి అమ్ముతున్నారని యూరోపియన్ కమీషన్ పాపులర్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ 'ఈవేవ్స్ డ్రాప్స్'ని నిలిపివేయడం జరిగింది. ఇక ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫే స్‌బుక్ కూడా అరుదైన సాప్ట్‌వేర్‌ని ఉపయోగించి, యూజర్స్ యొక్క ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఉన్న సమాచారంతో పాటు, పర్సనల్ సమాచారాన్ని కూడా సేకరించి, ఎడ్వర్టైజర్స్‌కి అందుబాటులోకి తీసుకువస్తుందని సమాచారం.

యూజర్స్‌కు సంబంధించిన పర్సనల్ సమాచారం అంతా కూడా యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న కంప్యూటర్స్‌లలో స్టోర్ అవుతుందని సమాచారం. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు ఫేస్‌బుక్‌లో ఎక్కువగా సంభవిస్తున్నాయి. దీనికి సంబంధించి ఫేస్‌బుక్ ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకొక పోవడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం.

ఇది ఇలా ఉంటే ఫేస్‌బుక్ మాత్రం ఈ వాదలను తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సందర్బంలో ఫేస్‌బుక్ ప్రతినిధి మాట్లాడుతూ, యూజర్స్ యొక్క పేర్లు ఏ సందర్బంలో కూడా మేము ఎడ్వర్టైజర్స్‌కు తెలియజేయడం లేదు. అంతేకాకుండా యూజర్స్‌కు సంబంధించిన పర్సనల్ సమాచారాన్ని థర్డ్ పార్టీలకు ఎట్టి పరిస్దితులలోను విక్రయించేది లేదని, మాకు అటువంటి అవసరం లేదని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot