బెంగుళూరు కంపెనీని కొనుగోలు చేసే యోచనలో ఫేస్‌బుక్..?

|

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఇండియాలో తొలి కొనుగోలుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిజినెస్ స్టాండర్డ్ తెలిపిన వివరాల మేరకు సామాజిక సంబంధాల వెబ్‌సైట్ఫేస్‌బుక్, బెంగుళూరుకు చెందిన స్టార్ట్‌అప్ లిటిల్ ఐ ల్యాబ్స్‌ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా మరికొద్ది వారాల్లో ప్రకటించే అవకాశం ఉంది.

 
బెంగుళూరు కంపెనీని కొనుగోలు చేసే యోచనలో  ఫేస్‌బుక్..?

లిటిల్ ఐ ల్యాబ్స్ సంస్థ డెవలపర్స్ ఇంకా టెస్టర్ల కోసం మొబైల్ యాప్ టూల్స్‌ను తయారు చేస్తుంది. ఈ కంపెనీని మే 2012లో గిరిధర్ మూర్తి, కుమార్ రంగరాజన్ (కంపెనీ సీఈఓ), సత్యం కందుల, లక్ష్మణ్ కక్కిరాలాలు ప్రారంభించటం జరిగింది.

సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం ఇండియాలో రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ ఏడాదికిగాను ఇండియాలో ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లను వినియోగిస్తున్న వారి సంఖ్య 37.4 శాతానికి వృద్ధి చెందినట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. 2016 నాటికి ఇండియా అత్యధిక మంది ఫేస్ బుక్ వినియోగదారులను కలిగి ఉన్న దేశంగా వృద్ధి చెందుతుందని ఇమార్కెటర్ సర్వే పేర్కొంది.

2013కుగాను సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగంలో 37.4 శాతం ఎదుగుదలతో భారత్ అపారమైన వృద్ధిని కనబరిచింది. 28.7శాతం వృద్ధితో ఇండోనేషియా రెండవ స్థానంలో నిలిచింది. 21.1 శాతం ఎదుగుదలతో మెక్సికో మూడవ స్థానంలో నిలిచింది. ఈ మూడు దేశాల్లో ఫేస్ బుక్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నట్లు ఇ-మార్కెటర్ సర్వే వెల్లడించింది.

2013కుగాను ఫేస్ బుక్ ను నెలవారి యూజర్ల సంఖ్య 1.026బిలియన్ గా ఇమార్కెటర్ అంచనావేస్తోంది. అత్యధిక మంది ఫేస్ బుక్ వినియోగదారులను కలిగి ఉన్న దేశంగా యూఎస్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. రెండవ స్థానంలో భారత్ ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X