అక్టోబర్ 19న ఫేస్‌బుక్లో ఏమి జరుగుతుంది..!!

Posted By: Super

అక్టోబర్ 19న ఫేస్‌బుక్లో ఏమి జరుగుతుంది..!!

గతంలో వన్ ఇండియా టెక్నాలజీ విభాగంలో ప్రచురించిన 'ఫేస్‌బుక్ టైమ్‌లైన్' ఫీచర్ అక్టోబర్ 19వ తారీఘున యూజర్స్‌కు అందుబాటులోకి రానుందని సమాచారం. అసలు 'ఫేస్‌బుక్ టైమ్‌లైన్' ఫీచర్ అంటే ఏమిటీ అనే ఆలోచన మీకు రావచ్చు. ఏమీ లేదండీ. 'ఫేస్‌బుక్ టైమ్‌లైన్' అంటే మీ జీవితం గురించి ఓ స్టోరీ. ఈ 'ఫేస్‌బుక్ టైమ్‌లైన్'లో మీ జీవిత సమాచారం, ఫోటోలు, ఇష్టమైనవి, మీ స్నేహితులు మీకు షేర్ చేసిన ముఖ్యమైన సమాచారం మీకు, మీ స్నేహితులకు అందిస్తుంది.

మీ యొక్క ఫేస్‌బుక్ ప్రోపైల్ టైమ్ లైన్ మోడ్ లోకి సెట్ చేసుకున్నారంటే పైన నేను చెప్పిన సమాచారం అంతా స్పష్టంగా స్నేహితులకు కనువిందు చేస్తుంది. ఈ టైమ్ లైన్ మోడ్‌లో మీయొక్క పేజికి పెద్ద ఇమేజిని కవర్ పేజిగా సెట్ చేసుకొవచ్చు. ఇందుకు గాను మీరు ఏఇమేజినైనా తీసుకొవచ్చు. ఎందుకంటే ఇది హై రిజల్యూషన్‌తో యూజర్స్‌కు కనువిందు చేస్తుంది.

ఈ ఫేస్‌బుక్ టైమ్ లైన్‌ని డెవలప్ చేసిన డెవలపర్స్ మాట్లాడుతూ ప్రస్తుతానికి దీనికి సంబంధించిన టెస్టింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అంటే అక్టోబర్ 19, 2011న ఈ అప్లికేషన్‌ని మీయొక్క ఫేస్‌బుక్ పేజిలలో చూడొచ్చు. అక్టోబర్ 19న ఫేస్‌బుక్ టైమ్ లైన్‌ని విడుదల చేసిన తర్వాత దీనికి సంబంధించిన మరింత సమాచారం అందివ్వడం జరుగుతుంది. ఫేస్‌బుక్ త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ ఫీచర్‌తో ప్రపంచ వ్యాప్తంగా 800మిలియన్ యూజర్స్ కలిగిన ఫేస్‌బుక్ యూజర్స్‌కు మరింత చేరవ కానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot