శవాల దిబ్బగా ఫేస్‌బుక్ : భయపెడుతున్న జుకర్‌బర్గ్ టార్గెట్‌

Posted By:

ఫేస్‌బుక్ ఏంటి.. అంతర్జాల శ్మశానంగా మారుతుందనేగా మీ సందేహం. ఇది నిజం. 2098 నాటికి అంతర్జాల శ్మశానంగా ముఖపుస్తకం మారనుంది. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన ఓ అంతర్జాల నిపుణుడు అంచనా వేస్తున్నారు. మరి అది ఎలా జరుగుతుంది.. ఫేస్‌బుక్ అసలు శవాల దిబ్బగా ఎందుకు మారుతుంది. అసలు జుకర్ బర్గ్ ప్లాన్ ఏంటీ...ఇలాంటి అనేక విషయాలను గిజ్‌బాట్ మీ ముందుకు తెస్తోంది. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: రూ. 12వేలకు ఐఫోన్ 5ఎస్: ఐఫోన్ కోసం పసికందును..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ కొన్నాళ్ళకు శ్మశానంగా

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొన్నాళ్ళకు శ్మశానంగా మారనుంది. దీన్ని వినియోగించేవారి సంఖ్య రోజురోజకూ పెరిగిపోతుండటంతో ఇంటర్నెట్ నిపుణులు ఈ విషయంపై ఆందోళన కూడా చెందుతున్నారు.

ఇప్పటికే కోటిమందికి పైగానే దాటిపోయిన యూజర్ల సంఖ్యపై

ఇప్పటికే కోటిమందికి పైగానే దాటిపోయిన యూజర్ల సంఖ్యపై అంచనాకు వచ్చిన నిపుణులు... 2098 సంవత్సరం నాటికి ఫేస్‌బుక్‌లో ఖాతాదారులకంటే మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు.

మనుషుల పేజీలకు బదులు స్మృతుల పేజీలు దర్శనమివ్వడాన్ని బట్టి

ఫేస్‌బుక్ పేజీల్లో మనుషుల పేజీలకు బదులు స్మృతుల పేజీలు దర్శనమివ్వడాన్ని బట్టి నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫేస్‌బుక్ ఖాతాదారులు మరణిస్తే ఆ పేజీని తొలగించే అవకాశం పెద్దగా కనిపించడం లేదు.

అతడి కుటుంబ సభ్యులుగాని, స్నేహితులుగాని ఖాతాను

దీంతో ఆ సామాజిక మాధ్యమంలో మరణించిన ఖాతాదారుడి పేజీని స్మృతుల పేజీగా మారుస్తున్న సంప్రదాయం కొనసాగుతోంది. అయితే అతడి కుటుంబ సభ్యులుగాని, స్నేహితులుగాని ఖాతాను కొనసాగిస్తుంటే మాత్రం ఆపేజీ బతికే ఉంటోంది.

ఇదే రీతిలో కొనసాగితే 2098 నాటికల్లా అదో శ్మశానంగా

దీనినే ప్రాతిపదికగా తీసుకుని అమెరికా మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో పరిశోధన విద్యార్థి హచెమ్ సాధిక్కి కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఫేస్‌బుక్‌ వాడేవారి సంఖ్య ఇదే రీతిలో కొనసాగితే 2098 నాటికల్లా అదో శ్మశానంగా మారుతుందని అధ్యయనాలు చెప్తున్నట్లు పేర్కొన్నారు.

మరణించినవారి ఖాతాలను సైతం ఆ నెట్‌వర్క్

మరణించినవారి ఖాతాలను సైతం ఆ నెట్‌వర్క్ ఇదే విధంగా కొనసాగిస్తే సంస్థ వృద్ధి రేటు సైతం భారీగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. అయితే ఆన్లైన్ లెగసీ ప్లానింగ్ కంపెనీ 'డిజిటల్ బియాండ్' లెక్కల ప్రకారం దిమ్మ తిరిగే నిజాలు ఇప్పుడు నిజంగా దిమ్మతిరిగేలా చేస్తున్నాయి.

9,70,000 మంది మరణించనున్నట్లు

వారి లెక్కల ప్రకారం ఈ ఏడు ప్రపంచంలో ఫేస్‌బుక్ వినియోగదారులు 9,70,000 మంది మరణించనున్నట్లు తెలుస్తోంది. అదే 2010 లో 3,85,368 మంది, 2012 లో 5,80,000 మరరణించినట్లు లెక్కలు చెప్తున్నాయి.

కొనసాగించని ఖాతాలనుగాని, మరణించినవారి ఖాతాలను గాని

దీంతో కొనసాగించని ఖాతాలనుగాని, మరణించినవారి ఖాతాలను గాని ఫేస్‌బుక్ స్వచ్ఛందంగా తొలగించేందుకు ముందుకు రాకపోవడంతో కొంతకాలానికి బతికున్నఖాతాదారులకంటే మరణించినవారి సంఖ్యే పెరిగిపోతుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.అందుకే ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఫేస్ బుక్ యోచిస్తోంది.

డాక్యుమెంట్లలో నామినీలను నియమించినట్లు...

ఈ నేపథ్యంలో ఆస్తులు, డబ్బులకు సంబంధించిన డాక్యుమెంట్లలో నామినీలను నియమించినట్లు... తమ ఖాతా వివరాలు తెలిసిన మరొకరిని నియమించుకోవాలని ఫేస్‌బుక్ యూజర్లకు సూచించే ఉద్దేశ్యంలో ఉంది. ఈ పద్ధతిలో మరణించినవారి లెక్కల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది.

మరో పది సంవత్సరాల్లో ఫేస్‌బుక్ ఏ మైలు రాయిని చేరుకోబోతోందనేదానికి

ఈ న్యూస్ ఇలా షాక్ కొడుతుంటే మరో పది సంవత్సరాల్లో ఫేస్‌బుక్ ఏ మైలు రాయిని చేరుకోబోతోందనేదానికి ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ షాక్ కొట్టే సమాధానాలు చెప్పారు. 2030 నాటికి ఫేస్‌బుక్ 500 కోట్ల మార్క్ చేరుకుంటుందని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

700 కోట్లలో 500 కోట్ల మందిని ఫేస్‌బుక్ యూజర్లుగా మార్చుకోవాలని

ప్రపంచ జనాభా 700 కోట్లకు పై మాటే. అయితే ఈ 700 కోట్లలో 500 కోట్ల మందిని ఫేస్‌బుక్ యూజర్లుగా మార్చుకోవాలని జుకర్ బర్గ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

జుకర్ బర్గ్ మాటలను బట్టి చూస్తే

జుకర్ బర్గ్ మాటలను బట్టి చూస్తే ఆధార్, ఓటర్, రేషన్ కార్డ్‌లాగా అన్ని ప్రభుత్వ పథకాలకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉండాల్సిందే అనే నిబంధన అమల్లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అన్న అభిప్రాయాన్ని టెక్ విశ్లేషకులు వెలిబుచ్చుతున్నారు.

చనిపోయనవాళ్ల అకౌంట్లు అలాగే బతికున్నవాళ్ల అకౌంట్లు

చనిపోయనవాళ్ల అకౌంట్లు అలాగే బతికున్నవాళ్ల అకౌంట్లు అన్నీ కలుపుకుని దాదాపు వచ్చే 10 ఏళ్లకు 500 కోట్లకు చేర్చాలనే జుకర్ బర్గ్ లక్ష్యం నేరవేరుతుందా లేదా చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Facebook to be world's biggest virtual graveyard by 2098
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot