లిస్టెడ్ కంపెనీ అవనున్న ఫేస్‌బుక్...!

Posted By: Staff

లిస్టెడ్ కంపెనీ అవనున్న ఫేస్‌బుక్...!

 

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ త్వరలో $75-100 బిలియన్ల విలువ కలిగిన బహిరంగ - లిస్టెడ్ కంపెనీగా అవతరించనుందని సోమవారం ఓ న్యూస్ ఛానల్ అధికారకంగా తెలిపింది. ఫైనాన్సియల్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కధనం ప్రకారం బుధవారం ఫేస్‌బుక్ అమెరికా ఫైనాన్సియల్ వాచ్‌డాగ్‌లో ఫైల్ పేపర్స్‌ని సమర్పించనుంది.

వాల్‌స్టీట్‌లో ఫేస్‌బుక్ ఈ సంవత్సరం ఓ గొప్ప భాగస్వామ్యం అమ్మకాలుగా ఉండడంతో పాటు, సుమారు $ 10 బిలియన్ సేల్స్‌ని పెంచుతుందని తెలిపారు. దీనితో పాటు ఫేస్‌బుక్ యొక్క ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) గత నెలలు నుండి మార్కెట్లోకి వస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఈ విషయంపై మీడియా మొగల్ రూపెర్ట్ ముర్డోచ్ ట్విట్టర్‌లో "ఫేస్‌బుక్ ఒక తెలివైన అచీవ్మెంట్‌ని సాధించింది, కానీ $75 - $100బిలియన్లు అంటే.. ఆపిల్‌తో పోల్చితే చాలా తక్కువగా ఉంది.

ఫేస్‌బుక్‌ని మార్క్ జూకర్స్ బర్గ్‌తో పాటు అతని స్నేహితులు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు 2004వ సంవత్సరంలో ప్రారంభించారు. కానీ ఇప్పడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్‌గా అవతరించడమే కాకుండా ఫేస్‌బుక్‌లో మొత్తం యూజర్స్ సంఖ్య 800 మిలియన్లుకు చేరింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot