'ఫేస్‌బుక్ పే డైలాగ్ మొబైల్ ఎస్‌డికె' అప్లికేషన్‌ అదుర్స్

Posted By: Prashanth

'ఫేస్‌బుక్ పే డైలాగ్ మొబైల్ ఎస్‌డికె' అప్లికేషన్‌ అదుర్స్

 

ఫేస్‌బుక్ ఛీప్ టెక్నాలజీ ఆఫీసర్ బ్రెట్ టేలర్ బార్సిలోనాలో జరుగుతున్న టెక్నాలజీ ఈవెంట్ మొబైల్ కాంగ్రెస్ వరల్డ్‌లో ఈరోజు కంపెనీ కొత్తగా విడుదల డెలపర్స్ కోసం విడుదల చేయనున్న వెబ్ అప్లికేషన్స్‌కి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయనున్నారు. గతంలో ఫేస్‌బుక్ వెబ్ అప్లికేషన్స్ కోసం కొత్త ఉత్సాహానికి ఊతమిచ్చిన విషయం తెలిసిందే. ఇదే సందర్బంలో టేలర్ 'ఫేస్‌బుక్ పే డైలాగ్ మొబైల్ ఎస్‌డికె' గురించి కూడా ప్రస్తావించారు.

'ఫేస్‌బుక్ పే డైలాగ్ మొబైల్ ఎస్‌డికె' అప్లికేషన్‌ సహాయంతో మొబైల్ ఆపరేటర్స్ మరియు అప్లికేషన్ డెవలపర్స్ ఇద్దరూ కలసి వారియొక్క అప్లికేషన్స్ లోకి ఆపరేటర్‌కు బిల్లింగ్‌కి అనుసంధానం చేయనున్నారు. ఫేస్‌బుక్ ఇప్పటికే ఏటి అండ్ టి, డెచ్ టెలికామ్, ఆరెంజ్, టెలిఫోనికా, టి-మొబైల్ అమెరికా సంయుక్త, వెరిజోన్, వోడాఫోన్, కెడిడిఐ, సాఫ్ట్ బ్యాంకు మొబైల్ కార్పోలతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం ద్వారా వినియోగదారులు డివైజ్‌లో డైరెక్టుగా 'పే డైలాగ్ కాల్' అప్లికేషన్‌ని నిక్షిప్తం చేయనున్నారు. వీటితో పాటు ఫేస్‌బుక్ కొత్తగా 'రింగ్ మార్క్' అనే కొత్త మొబైల్ బ్రౌజర్‌ టెస్ట్ సూట్‌ని విడుదల చేయనుంది. W3C Mobile Web Platform Core Community Groupలో ఈరోజు నుండి ఇది లభ్యమవుతుంది. దీనిని ఫేస్‌బుక్ విడుదల చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఓపెన్ గ్రాఫ్‌ని మరింతగా యూజర్స్‌ చెంతకు చేరవేసేందుకేనని నిపుణులు భావిస్తున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting